Jabardast New Anchor: హాట్ బ్యూటీ అనసూయ తన 9 ఏళ్ళ జబర్దస్త్ ప్రస్థానానికి ముగింపు పలికింది. మరి అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వస్తారు అంటూ పెద్ద చర్చే జరిగింది. మొత్తానికి అనసూయ స్థానంలో కొత్త అమ్మాయిని ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారు. జబర్దస్త్ టీమ్ చేసిన ఈ ఆహ్వానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి ?, జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన ఆ అందాల రాశి అనసూయను బీట్ చేస్తోందా ? అనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతుంది.
ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోను తాజాగా మల్లెమాల వారు రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ చివర్లో కొత్త యాంకర్ ని పరిచయం చేసే క్రమంలో జబర్దస్త్ కొత్త యాంకర్ ని ఏకంగా పల్లకీలో మోసుకొచ్చారు. ఆమె ఎవరో తెలుసుకోవాలని టీమ్ లీడర్స్ కూడా ఆసక్తి చూపించారు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ పై హైప్ తీసుకురావడానికి ఆ కొత్త యాంకర్ ఫేస్ ను చూపించకుండానే ప్రోమోను ఎడిట్ చేశారు.

మొత్తానికి ఆ యాంకర్ ఫేస్ ను రివీల్ చేయకుండా ఇటు ప్రేక్షకులను కూడా సస్పెన్స్ లో పెట్టారు. అయితే, ఆ యాంకర్ మరెవరో కాదు.. ‘మంజూష’ అని గత కొన్ని రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, జబర్దస్త్ టీమ్ నుంచి వినిపిస్తున్న లీకులు ప్రకారం అనసూయ స్థానంలో వచ్చింది ‘మంజూష’ నేనట. గత నెల రోజుల నుంచి ఆమెకు జబర్దస్త్ యాంకర్ పార్ట్ కు సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారట.
అలాగే మంజూష డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆమె ఎంట్రీకి సంబంధించిన విజువల్స్ వరకూ ప్రతిదీ జబర్దస్త్ టీమ్ ఇప్పటికే వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగూ అనసూయ కంటే అందంలో మంజుషనే టాప్ అని టాక్ ఉంది. పైగా మంజూషాకి కూడా అందాల ఆరబోతలో ఎలాంటి మొహమాటాలు ఉండవు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది. అందుకే.. అనసూయని బీట్ చేసే స్థాయి మంజుషాకి ఉంది. ఆ రేంజ్ లోనే ఆమె సన్నద్ధం అయ్యిందట.
మొత్తానికి ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’లాగే మంజూష కూడా అందాల విధ్వంసం సృష్ఠించేలా ఉంది. ఇంతకీ మంజూషకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారో తెలుసా ?, ఎపిసోడ్ కి 50 వేలు ఇస్తున్నారు. కానీ, అనసూయకు మాత్రం ఎపిసోడ్ కి లక్ష రూపాయలు ఇచ్చారు. వన్ ఇయర్ తర్వాత మంజూషాకి కూడా లక్ష ఇవ్వనున్నారు. నిజానికి తెలుగు తెర పై బోల్డ్ యాంకర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ.. వారిలో ‘యాంకర్ మంజూష’ శైలి వేరు. ఆమె తనదైన ముద్రను వేస్తూనే కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇప్పుడు జబర్దస్త్ వేదిక పై కూడా మస్త్ చేయబోతుంది.