Komatireddy Mind Game: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దోబూచులాడుతున్నారు. తానే బీజేపీలో హోల్ అండ్ సోల్ గా కావాలనేదే ఆయన ఉద్దేశం. కానీ కొత్తగా వచ్చిన వారికి అందలాలు ఎక్కడించడం అంత సులువైన పని కాదు. ఆ విషయం ఆయనకు కూడా తెలిసినా బీజేపీలో తనకు మంచి హోదా కావాలని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజగోపాల్ రెడ్డి చేరికపై ఇంకా సందేహాలు వస్తున్తున్నాయి.

బీజేపీలో తాను చేరితే ఇక తిరుగేలేదని చెప్పుకుంటున్నారు. తానే సీఎం అభ్యర్థి కావాలనే ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇవన్నీ జరిగేవేనా? ఆయన చేరితో చేరాలి కానీ ఇలా ప్రచారం చేసుకుంటూ తప్పుడు సంకేతాలు ఇస్తే ప్రజల్లో ఉన్న ఇమేజ్ కాస్త దెబ్బ తింటుంది. దీంతో భవిష్యత్ లో ఇంకా కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయనలో ఎందుకో అంత దురాలోచన అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి నిజంగా బీజేపీలో చేరతారా? లేక వట్టి ప్రచారమేనా? అనే అనుమానాలు అందరిలో వస్తుండటం సహజమే.
Also Read: Chikoti Casino Issue: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ‘చీకోటి’ వ్యవహారం.. ఆ నేతలు ఎవరు?
ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. అంతేకాని నాకు ఇది కావాలి అది కావాలి అంటూ ఏవో షరతులు పెడుతూ వాయిదాలు వస్తే నష్టం మనకే అనే అంచనాలు అందరిలో వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతాడా? లేదా అనేది కూడా అనుమానంగానే తోస్తోంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి అనవసర ప్రచారం నిర్వహించి పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు కానీ బీజేపీలో చేరుతున్నట్లు ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం నిజంగా ప్రశ్నార్థకమే అవుతోంది.
ఇంతకీ రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారా? లేదా అనేది తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇలాగే ప్రచారం చేసి చివరకు మనసు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈషారి కూడా అలాగే చేస్తున్నారా? రాజగోపాల్ రెడ్డి పార్టీ మరుతున్నారనే ప్రచారం చేసుకున్నా బీజేపీలో చేరుతున్నట్లు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం కూడా అలాగే పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం చేసుకుని చివరకు కాంగ్రెస్ లోనే కొనసాగడం ఆయన నైజంగా కనిపిస్తోంది. మొత్తానికి మునుగోడు రాజకీయం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read: YCP MPs: సగం మందికిపైగా ఎంపీలకు నో చాన్స్.. వైసీపీలో ఏం జరుగుతోంది?