Nelson and Lokesh Kanagaraj : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో నెల్సన్ ఒకరు. ప్రస్తుతం ఆయన భారీ సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాలు సైతం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉండటమే కాకుండా తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం నెల్సన్ లాంటి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇతనితో పాటుగా లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు సైతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే విజయ్ తో చేసిన లియో ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి ఆయన సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
Also Read : ఎన్టీఆర్ కంటే అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ..ఇది అన్యాయం!
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నెల్సన్, లోకేష్ కనకరాజ్ ఇద్దరు కూడా ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమాలు చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు దర్శకులు ఎవరికివారు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న సినిమాలతో ఎవరు భారీ సక్సెస్ ని సాధిస్తారు.
తద్వారా ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంది అనే విషయాల మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. మరి ఆ పోటీని తట్టుకొని ఎవరు నిలబడగలుగుతారు. ఎవరు వాళ్ళ సినిమాలతో వండర్స్ ని క్రియేట్ చేస్తారు. తద్వారా భారీ వసూళ్లను రాబడతారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇద్దరు వల్లే పాన్ ఇండియాలో తమిళ్ సినిమా హవా కొనసాగబోతుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళకంటూ ఒక సపరేట్ గుర్తింపు రావాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పటికి భారీ విజయాన్ని సాధించే సినిమాలైతే రావడం లేదు…అందువల్లే వాళ్ళు పాన్ ఇండియా సక్సెస్ లను సాధించడం లో కొంతవరకు వెనకబడి పోయారు…
Also Read : లోకేష్ కనకరాజ్ చిరంజీవి కాంబోలో సినిమా రాబోతోందా..?సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్లబోతుంటే..?