Nelson Dileep Kumar : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియా లోనే ది బెస్ట్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్న ఎన్టీఆర్(Junior NTR), ఆ తర్వాత ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) తో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో చేయబోయే సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పై వెళ్లనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు మరో ఏడాది సమయం పట్టొచ్చు. ‘జైలర్ 2’ చిత్రం పూర్తి అయ్యాకనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
ఈ చిత్రాన్ని ‘పుష్ప 2’ మూవీ ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సంస్థ వారు నెల్సన్ కి 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అడ్వాన్స్ గా ఇచ్చారట. అంతే కాదు, సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటాలు కూడా ఇస్తారట. అంటే ఆయన రెమ్యూనరేషన్ వంద కోట్ల రూపాయలకు పైమాటే. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కేవలం 75 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నాడట. లాభాల్లో వాటా తీసుకుంటాడా, లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా అంటే, కచ్చితంగా తమిళ మర్కెట్స్ అన్ని ఈ చిత్రానికి వర్కౌట్ అవ్వొచ్చు. తమిళ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఉంది. మన తెలుగు మార్కెట్ కంటే రెండు రెట్లు ఎక్కువ. నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయడం వల్ల ఓవర్సీస్ లో తెలుగు మార్కెట్ తో పాటు, తమిళ మార్కెట్ తోడై, సూపర్ హిట్ టాక్ వస్తే కేవలం ఓవర్సీస్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టొచ్చు.
ఇక తమిళనాడు మార్కెట్ ఎలాగో ఉంటుంది, ఈ ప్రాంతం నుండి కచ్చితంగా ఈ సినిమాకి 200 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కేవలం తమిళ వెర్షన్ నుండే 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టొచ్చు. అందుకే ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ఎన్టీఆర్ కి తెలుగు, హిందీ మర్కెట్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమాకి పొరపాటున హిట్ టాక్ పడితే అవలీల గా 1500 కోట్లు రాబట్టేంత సత్తా ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో షూటింగ్ ని ముగించుకోనుంది. ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.