Homeఎంటర్టైన్మెంట్Nari Nari Naduma Murari Closing Collections: 'నారీ నారీ నడుమ మురారి' వరల్డ్...

Nari Nari Naduma Murari Closing Collections: ‘నారీ నారీ నడుమ మురారి’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..2 కోట్ల బడ్జెట్ తో కళ్ళు చెదిరే లాభాలు!

Nari Nari Naduma Murari Closing Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న శర్వానంద్(Sharwanand), ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకొని మళ్లీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అసలు అంచనాలే ఉండేవి కాదు. నాలుగు సినిమాల మధ్య వస్తుంది, ఎంతో కొంత వసూళ్లను పోగు చేసుకోవడం కోసమే, హిట్ అవుతుందనే నమ్మకం లేదంటూ […]

Nari Nari Naduma Murari Closing Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న శర్వానంద్(Sharwanand), ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకొని మళ్లీ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అసలు అంచనాలే ఉండేవి కాదు. నాలుగు సినిమాల మధ్య వస్తుంది, ఎంతో కొంత వసూళ్లను పోగు చేసుకోవడం కోసమే, హిట్ అవుతుందనే నమ్మకం లేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అత్యధిక శాతం మందికి ఈ చిత్రం విడుదల అయ్యింది అనే విషయం కూడా మొదటి రోజు తెలియదు. అలాంటి తక్కువ బజ్ తో విడుదలై, మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

థియేట్రికల్ రన్ ని వరల్డ్ వైడ్ గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. శర్వానంద్ గత చిత్రానికి వరల్డ్ వైడ్ కలిపి కూడా ఇంత షేర్ వసూళ్లు రాలేదు . దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విద్మగా సీడెడ్ ప్రాంతం నుండి దాదాపుగా ఈ చిత్రానికి కోటి 60 లక్షల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కోస్తాంధ్ర ప్రాంతం నుండి అయితే ఏకంగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 15 కోట్ల 60 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల నుండి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి ఏకంగా 3 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి దాదాపుగా 10 కోట్ల రూపాయిల లాభం వచ్చింది. రీసెంట్ గానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది. థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, ఇక్కడ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper