Nani Shekhar Kammula Conflict: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. న్యాచురల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న నాని సైతం ప్రస్తుతం టైర్ వన్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఆయన మాస్ జపం చేస్తూ వరుసగా మాస్ సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నాడు. కారణం ఏదైనా కూడా తను టైర్ వన్ హీరోగా మారాలంటే మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకోవాలి. అలా అయితేనే వాళ్ళ సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే నాని సైతం మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన శేఖర్ కమ్ముల సినిమాకి కమిట్ అయినప్పటికి ఆయన సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి. కాబట్టి వాటిని చేయడానికి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.
మొదట్లో ఓకే అని చెప్పి ఆ తర్వాత నో చెప్పడానికి గల కారణం ఏంటి అని శేఖర్ కమ్ముల సైతం నానితో మాట్లాడాడట. కానీ నాని మాత్రం నేను మాస్ సినిమాలు చేస్తున్నాను. మళ్ళీ క్లాస్ సినిమాల వైపు రాలేను సార్ అంటూ సమాధానం ఇచ్చారంట. దాంతో ఆయన కొంతవరకు అప్సెట్ అయినట్టుగా తెలుస్తుంది…
నాగచైతన్య చేసిన లవ్ స్టోరీ సినిమాకి మొదట నాని ని హీరోగా అనుకున్నారు. కానీ నాని నో చెప్పడంతో ఆ సినిమా నాగ చైతన్య వద్దకు వెళ్ళింది. ఇక ప్రస్తుతం మరికొన్ని కథలను సైతం నాని కోసం అనుకున్నప్పటికి అవి కూడా వర్కౌట్ కాలేదు. దాంతో నాని మీద శేఖర్ కమ్ముల కొంతవరకు కోపంతో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన ‘హ్యాపీడేస్ 2’ సినిమాని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది… తన సినిమాలో హీరోగా నటించే అవకాశం వస్తే వాళ్ళు తర్వాత స్టార్ హీరోలుగా మారే అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి అతని సినిమాలో నటించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు…