Nagarjuna : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు హీరోయిన్లు ఉన్నా కూడా స్క్రీన్ మీద ప్రేక్షకుడిని మైమరిపింపజేసే కాంబినేషన్స్ కొన్నే ఉంటాయి. ఆ హీరో హీరోయిన్ నటించినప్పుడు మాత్రమే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. స్క్రీన్ మీద వాళ్ళను చూస్తూ ప్రేక్షకులు వాళ్ళను వాళ్ళు మర్చిపోయేలా చాలా చక్కటి కెమిస్ట్రీని వర్కౌట్ చేసిన హీరో హీరోయిన్లు ఎవరు అంటే నాగార్జున-టబ్ గా చెప్పొచ్చు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో వీళ్ళ మధ్య 100% కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి కెమిస్ట్రీని వర్కౌట్ చేసిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మూవీని చూసిన చాలామంది నాగార్జున టబులలో తమను తాను చూసుకున్నామని చెప్పడం విశేషం… అందుకే ఈ సినిమాలో వాళ్ళిద్దరు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఇక తర్వాత వాళ్లు సినిమాలో నటించిన కూడా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈ సినిమా లో వాళ్ళిద్దరూ చాలా బాగా నటించి మెప్పించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో పాటలు అద్భుతంగా ఉంటాయి.
కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంటాయి. ఎమోషనల్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికైతే ది బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ని వర్కౌట్ చేసిన వారిలో నాగార్జున – టబు లు మొదటి స్థానంలో ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ప్రస్తుతం వీళ్ళిద్దరు ‘కింగ్ 100’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ తెర మీద చూడడానికి అక్కినేని అభిమానులతో పాటు టబు ఫ్యాన్స్ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి టబు తెలుగులో పెద్దగా సినిమాలైతే చేయడం లేదు. అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించింది.
ఇక తర్వాత సైతం ఆమె పలు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న కూడా ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఒకవేళ తన దగ్గరికి ఎవరైనా స్క్రిప్ట్ తీసుకొని వచ్చినా కూడా క్యారెక్టర్ నచ్చితేనే తను నటించడానికి సిద్ధమవుతుంది. లేకపోతే మాత్రం ఆ క్యారెక్టర్ ను పక్కన పెట్టేస్తుంది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ సినిమాలో సైతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది…