Nagarjuna Kalyan Krishna movie latest updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో విభిన్న తరహా సినిమాలను చేస్తున్న మన దర్శకులు ఇకమీదట కూడా వైవిద్య భరితమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం తెలుగు సినిమాల హవాని ఆపలేకపోతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించినా కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. కాబట్టి బాలీవుడ్ ని డామినేట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి విజయాలను సాధించిన రాని గుర్తింపు తెలుగు సినిమా హీరోలు ఒకటి రెండు సినిమాలతో తెచ్చుకుంటున్నారు. అలాగే భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక నాగార్జున ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమైన కూడా ఫ్యూచర్లో ఆయన పాన్ ఇండియా ప్రాజెక్టులను చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు.
ప్రస్తుతం తన వందో సినిమాని రా కార్తీక్ అనే తమిళ డైరెక్టర్ తో చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక జూన్ నెల నుంచి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోబోతున్నారట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే మలయాళం లో మంచి పాపులారిటిని సంపాదించుకొని తెలుగులో సైతం పలు సినిమాలు చేసి స్టార్ హీరోగా మారిన దుల్కర్ సల్మాన్ గా తెలుస్తుంది.
నాగార్జున – దుల్కర్ కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా రాలేదు ఇక ఇదే మొదటిసారి కావడం విశేషం… డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ ని కలిసి అతనికి కథ చెప్పారట. తను కూడా ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే నాగార్జున దుల్కర్ కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ నేపథ్యంలో ఉండే కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఉండేవిధంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…