Sai Pallavi: హీరోయిన్స్ క్యాటగిరీలో ఆడియన్స్ అమితంగా ఇష్టపడే హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi). ఈమెకు ఉన్న క్రేజ్ ని చూసి అందరూ లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. అందం, నటన, డ్యాన్స్ ఇలా ప్రతీ దాంట్లోనూ సాయి పల్లవి మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే ఆడియన్స్ కి ఎంతో బెటర్ అనిపిస్తుంది. అందుకే ఆమెకు హిట్/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది మన టాలీవుడ్ లో ‘తండేల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సాయి పల్లవి, ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయన్’ లో సీతగా నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. వచ్చే ఏడాది లో ఈ చిత్రం మొదటి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సాయి పల్లవి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది.
గత కొద్దిరోజుల నుండి కమల్ హాసన్(Kamal Hassan) నిర్మాతగా, సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల చేత ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ‘పార్కింగ్’ చిత్రం తో ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు ని అందుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ఇప్పుడు సాయి పల్లవి హీరోయిన్ పాత్రకు ఎంపిక అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ఒక సినిమాకు అంత తేలికగా ఒప్పుకోదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అవతల ఎంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నా సరే, ఆమెకు కథ నచ్చాలి, అందులో తన పాత్ర కూడా నచ్చాలి, అప్పుడే ఆమె ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుంది.
అలాంటి సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుందంటే, కచ్చితంగా ఈ చిత్రం లో బలమైన విషయం ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కోసం సాయి పల్లవి దాదాపుగా 15 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని టాక్. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా ప్రస్తుతం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. అలాంటిది సాయి పల్లవి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటే ఆమెకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈమెని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటారు. అందుకే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు.