దర్శకుడు నక్కిన త్రినాధరావు అంటే.. బయట ప్రపంచానికి పెద్దగా ఎవ్వరికీ తెలియదు గానీ, ఆయనకు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గా నక్కినకు ఇప్పటికీ క్రేజ్ ఉంది. కానీ ఎందుకో తన కొత్త సినిమాని సెట్ చేసుకోవడానికి మాత్రం నక్కిన అష్టకష్టాలు పడుతున్నాడు. ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం సినిమా మొదలవ్వాలి, కానీ ఇప్పటికీ ఎనౌన్స్ మెంట్ కూడా లేకుండా పోయింది. నిజానికి నక్కిన దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ కలయికలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ఈ పాటికే మొదలవ్వాలి.
పైగా మొదలవుతుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే నక్కిన త్రినాధరావు ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా రవితేజతో తమ తరువాత సినిమా ఉంటుందని.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని చెప్పుకొచ్చాడు. అయితే, రవితేజ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు గానీ, నక్కిన సినిమాకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలా అని ఈ సినిమా క్యాన్సల్ అయిందా ? అంటే అదీ లేదు. సినిమా ఉందట. కాకపోతే ఎప్పుడు అనేదే ఎవ్వరికీ తెలియకుండా పోయింది.
ఈ క్షణం వరకూ సినిమా ఎప్పుడు ఉంటుందనేదే క్లారిటీ లేదని నక్కిన కాస్త బాధగానే చెబుతున్నాడు. మరి రవితేజ ఇప్పటికైనా నక్కిన బాధను అర్ధం చేసుకుంటే మంచింది. కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలైన ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. పైగా త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదేవిధంగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి రవితేజ – త్రినాథరావ్ నుండి రానున్న ఈ కామెడీ మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.