Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: అఖిల్ పేరు మార్చుకున్నంత మాత్రాన హిట్ వస్తుందా..?

Akhil Akkineni: అఖిల్ పేరు మార్చుకున్నంత మాత్రాన హిట్ వస్తుందా..?

Akhil Akkineni: ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉండేది. నాగేశ్వరరావు ఎన్నో వైవిద్యమైన పాత్రలను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ తో పాటు పోటీపడి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇక ఆయన తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒకడిగా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోలు ఎంత మాత్రం వాళ్ళ సత్తాను చాటులేక పోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టులు ప్రేక్షకులను ఏమాత్రం అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. మిగతా హీరోలతో పోలిస్తే వీళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే ఆయన శతవిధాల కష్టపడుతున్నాడు. ఇక దాంతో పాటుగా తన పేరును నాగ అఖిల్ అని మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. లెనిన్ మూవీ టైటిల్ లో నాగ అఖిల్ గా మనం చూడబోతున్నాం. వాళ్ల ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరికి నాగ అనేది వస్తే సక్సెస్ సాధిస్తారు అనే ఒక నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు.

నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరికి పేరు ముందు నాగ అనేది కామన్ అయిపోయింది. అందుకే అఖిల్ సైతం తన పేరును నాగ అఖిల్ గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. పేరు మార్చినంత మాత్రాన సక్సెస్ లు వస్తాయా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ముందుకు సాగినప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించగలం అనే ఒక కాన్ఫిడెంట్ తో అఖిల్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా లెనిన్ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper