Homeఎంటర్టైన్మెంట్‘మహానటి’ డైరెక్టర్ పై నెగిటివ్ కామెంట్స్..

‘మహానటి’ డైరెక్టర్ పై నెగిటివ్ కామెంట్స్..

మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ట్వీటర్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నయి. పాతతరం నటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ‘మహానటి’ మూవీని నిర్మించి జాతీయ స్థాయిలో నాగ్ అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మహానటి’ మూవీని సాంప్రదాయబద్దంగా తెరకెక్కించి ఈనాటి ప్రేక్షకులను మహానటి సావిత్రిని పరిచయం చేశాడు. ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడంలో నాగ్ అశ్విన్ పాత్ర అమోఘం. ఇదిలావుంటే సినిమా థియేటర్లలో మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుంది? […]


మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ట్వీటర్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నయి. పాతతరం నటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ‘మహానటి’ మూవీని నిర్మించి జాతీయ స్థాయిలో నాగ్ అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మహానటి’ మూవీని సాంప్రదాయబద్దంగా తెరకెక్కించి ఈనాటి ప్రేక్షకులను మహానటి సావిత్రిని పరిచయం చేశాడు. ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడంలో నాగ్ అశ్విన్ పాత్ర అమోఘం. ఇదిలావుంటే సినిమా థియేటర్లలో మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుంది? అని నాగ్ అశ్విన్ ట్వీటర్లో అభిమానులను అడిగాడు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడు సైలెంట్ గా కన్పిస్తూ.. తన పని తాను చేసుకుపోయే నాగ్ అశ్విన్లో ఇలాంటి కోణం ఉందా అని నెటిజన్లు షాక్ అవుతోన్నారు. ‘మహానటి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు మద్యం సరఫరా చేస్తే బాగుంటుందనే ఆలోచన చేయడంతో పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న కల్చర్ మన దగ్గర ఉంటే తప్పేంటేనే కోణంలో నాగ్ అశ్విన్ సమర్థించుకోవడంతో ఆయనపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కవ అవుతోన్నాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నాగ్ అశ్విన్ పై గుస్సా అవుతోన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ కాంప్లీట్ కాగానే వైజయంతీ బ్యానర్లో ప్రభాస్ మూవీ చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అనవసర వివాదాల్లో చిక్కుకుంటే ఆ ప్రభావం ప్రభాస్ మూవీ ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రేక్షకులకు మద్యం అందించానికి బదులుగా సినిమాలో కంటెంట్ పెంచితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని వారంటున్నారు. సినిమాలో కంటెంట్ లేకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన థియేటర్లలో సినిమాలు ఆడవని నాగ్ అశ్విన్ ఇది తెలుసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ‘మహానటి’తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దానిని కాపాడుకుంటారో లేక వివాదాలను కొనితెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper