
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతుండగా అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కత్తి కార్తీక బరిలో దిగుతోంది. ఈ మేరకు దుబ్బాకలో కత్తి కార్తీకను నియోజకవర్గ ప్రజలు గెలిపించాలంటూ పెద్దఎత్తున పోస్టర్లు వెలియడం చర్చనీయాంశంగా మారింది.
టీవీ హెస్టుగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇప్పటికే కత్తి కార్తీకకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గతంలో వివిధ న్యూస్ ఛానల్లో హోస్టుగా చేసి తెలంగాణ యాసలో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా తెలుగులో అతిపెద్ద రియల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ లో కొన్ని వారాలపాటు కంటెస్టుగా నిలిచి చాలామంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆమెకు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ. పద్మారావుగౌడ్ తో ఆమె కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో దుబ్బాక ఎన్నికల బరిలో నిలిచి ప్రజా నాయకురాలిగా మారేందుకు సిద్ధమవుతోంది.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో తెలంగాణలో ఉప ఎన్నిక జరగనుండటం ఖాయంగా తేలింది. ఇక్కడి నుంచి కత్తి కార్తీక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వినాయక చవితి ఉత్సవాల్లోనూ ఆమె పాల్గొని ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని.. తనను ఆశీర్వదించండి అంటూ ఓట్లర్లను వేడుకున్నారు. నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ అందరికీ కంటే ముందుగా ప్రచారంలో కత్తి కార్తీక దూసుకెళుతున్నారు.