Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే చెబుతూ ఉంటాం. గత దశాబ్ద కాలంలో రాజమౌళిని బీట్ చేయడానికి ఎవరూ రాలేదని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. ఇటీవలే తెలుగుసినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. కానీ అప్పుడప్పుడు రాజమౌళినే తన గురించి చెబుతూ ఆకర్షిస్తూ ఉంటారు. లేటేస్టుగా తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా తన లవ్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. తనది లవ్ కాదని, ఆకర్షణ మాత్రమేనని అన్నారు. అయితే ఆయన అలా అనడంలో ఓ గూడార్థం దాగి ఉంది. అదేంటో చూడండి.
సినిమాల్లో నటిస్తూ పర్సనల్ లైఫ్ ను సాఫీ గా మెయింటేన్ చేసేవారు చాలా తక్కువమందే ఉంటారు. అలా మెయింటేన్ చేసేవారు అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా లైఫ్ విచిత్రంగా ఉంటుంది. ఉప్పుడు సక్సెస్ అవుతుందో.. ఎప్పుడు ఫెయిల్ అవుతుంతో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ, పెళ్లి చేసుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజమౌళికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో రమా పరిచయం అయ్యారు. ఆమెను చూసి ఇంప్రెస్ అయ్యారు. అమెను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే అది సాధ్యమ్యే పనేనా? అని అనుకున్నారు. అసలు ఇదే ప్రేమనా? లేక ఆకర్షనా? అనే అనుమానం కూడా వచ్చింది. దీంతో చాలా జాగ్రత్తగా తాను లవ్ చేసినా ఆమెతోనే ఆ మ్యాటర్ బయటపెట్టేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత తనకు సినిమాలపై మోజు ఎక్కువ. తనకు సహకరిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని కూడా తేల్చాడు. దీనికి రమా గారు ఒప్పుకోవడంతో ఇద్దరు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘ 1992 నుంచి డైరెక్టర్ అవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మధ్యలో ఆ కాన్ఫిడెంట్ పోయింది. ఈ సమయంలోనే రమా పరిచయం అయ్యారు. కానీ ప్రేమంటే భక్ష్ం.. బాధ్యత.. సినిమా అనేది నిలకడలేనిది. ఇలాంటి తరుణంలో పెళ్లి పెటాకులు అంటే తట్టుకోగలనా? అనే డౌట్. అయితే నిజానికి నాది ప్రేమ కాదు.. ఆకర్షణ.. దీంతో మొదటి నుంచి చాలా జాగ్రత్తగా మెయింటేన్ చేశా.. సినిమా విషయంలో నా పక్కనుండి సపోర్టు చేస్తేనే పెళ్లి చేసకుంటానని చెప్పా’ అంటూ ఆయన చేసిన మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.