Renu Desai: కొంత మంది నటీమణులు ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్లు అవుతారు. అయితే చాలా కారణాల వల్ల కొద్దిరోజుల్లోనే సినీ ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తూ ఉంటుంది. సందర్భాన్ని భట్టి ట్వీట్లు చేస్తూ హల్ చల్ చేస్తుంటారు. రేణు దేశాయ్ తన కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు అకీరా నందన్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసి సంచలన కామెంట్స్ చేశారు.
‘బద్రి’ సినిమా ద్వారా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తరువాత మరోసారి పవన్ తో కలిసి ‘జానీ’ సినిమాలో నటించింది. ఆ తరువాత మరే హీరోతో కలిసి నటించలేదు. ఆ క్రమంలో 2009లో పవన్, రేణు దేశాయ్ లు పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీనా నందన్, ఆద్య అనే పిల్లలు ఉన్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల పవన్ కు దూరంగా ఉంటోంది రేణుదేశాయ్. సినిమాల్లో నటించకపోయినా కాస్ట్యూమ్ డిజైనర్ గా పలు సినిమాలకు పనిచేసింది రేణు దేశాయ్. ఇక లేటేస్టుగా ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ తరుణంలో అకీనా నందర్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోతో ఓ సంచలన మెసేజ్ పెట్టింది. ‘నా కుమారుడిని ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే జిమ్ సెంటర్ల నిర్వాహకులకు నేనొక్కటే కోరుతున్నా.. ఇక్కడ ఇంగ్లీష్ పాటలకు బదులుగా మాతృభాషలోని పాటలు పెట్టడం ద్వారా మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయి.. ’ అని తెలిపింది.
తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఇంగ్లీస్ సాంగ్స్ ను ప్లే చేసేవారు. ఆ సమయంలోనే నేను వారికి తెలుగు పాటలు పెట్టాలని కోరాను. లోకల్ సాంగ్స్ ప్లే చేయడంతో ఆ సినిమాలపై అభిమానం పెరుగుతుంది… అని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇక ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ చేసిన మెసేజ్ కు చాలా మంది రిప్లై ఇస్తున్నారు.