Mokshagna New Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట సింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న బాలయ్య బాబు ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం వరుసగా నాలుగు సక్సెస్లాంజ్ అందుకున్న ఆయన ఇప్పుడు బోయపాటి తో చేసిన సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడిగా బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఆయన ఎంట్రీ రోజురోజుకి లేట్ అయిపోతుంది. హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా ఇప్పటివరకు ఇంకా పట్టాలెక్కలేదు. ఇక మోక్షజ్ఞ అప్పట్లో లావుగా ఉంటూ కనిపించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత ఆయన ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చాలా స్లిమ్ గా మారాడు. ఇక ఇప్పుడు ఒక ఇంట్లో ఈవెంట్ కి హాజరైన ఆయన మరింత సన్నబడిపోయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఫోటోలో ఆయనను చూసిన ప్రతి ఒక్కరు హీరోలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం… మరి ఈ సంవత్సరం ఎండింగ్లో అయిన ప్రశాంత్ వర్మ తో చేయబోతున్న సినిమా స్టార్ట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం దీని మీద ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…
Also Read: ‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
ఇక ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే ప్రశాంత్ వర్మ ను బాలయ్య బాబు పక్కకు పంపించేసినట్టుగా తెలుస్తోంది. బాలయ్య తన ఓన్ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నడనే వార్తలు కూడా వచ్చాయి.
కానీ వీటిలో ఏది నిజమనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇక మరి కొంతమంది అయితే నాగ్ అశ్విన్ సినిమాతో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడు అంటూ చాలా వార్తలు వినిపించాయి. మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే సంవత్సరమే ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..?
ఇంక నువ్వు సర్దుకోనే టైం వచ్చింది రా
"సింపతి స్టార్ జమ్మలమడుగు జమాలత్ భాషా"ఆహా ఏమి తెజస్సు , ఏమి అందం , ఏమి రాజసం…
ఆరడుగుల కటౌట్ #NandamuriMokshagna pic.twitter.com/0TJDbiDrYJ— సుజత్ 'సున్నితమైన వాడు' ️☪️✝️ (@KadiroduOffl) August 17, 2025