Mokshagna : నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. నిజానికి ఆయన వరుసగా నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకోవడం అనేది అతని అభిమానులను చాలావరకు సంతోషపడేలా చేస్తుందనే చెప్పాలి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంతు కేసరి, డాకు మహారాజ్ లాంటి నాలుగు సినిమాలతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించిన బాలయ్య బాబు (Balayya Babu) ఇప్పుడు బోయపాటితో (Akhanda 2) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు. మరి తన కొడుకు అయిన మోక్షజ్ఞ(Mokshagna) సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఈ సంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ బాలయ్య బాబు చాలా గట్టిగా చెప్పినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం కూడా ఉండబోదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈయనతో సినిమా చేయాలనుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు ఈ సినిమాని మొదలు పెట్టలేదు. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ మరోసారి తన మేకోవర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది. సినిమా లేట్ అవుతున్న కొద్ది ఆయన వర్కౌట్స్ ఏమి చేయకుండా డిలే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.
అందుకే లేటెస్ట్ గా కనిపించిన పిక్స్ లో ఆయన మరికొంత లావైనట్టుగా తెలుస్తోంది. దానివల్ల ఆయన మేకోవర్ మీద మరోసారి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికి ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.
అందువల్లే ఈ సినిమా రోజురోజుకు లేట్ అవుతూ వస్తుందంటూ బాలకృష్ణ సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఎలాగైనా సరే ఈ సంవత్సరంలో తన వారసుడిని ఇంట్రడ్యూస్ చేయాలని ధృడ సంకల్పంతో ఉన్నాడు.
కాబట్టి ఈ సంవత్సరం చివరి నెలలో బాలయ్య బాబు తన కొడుకుని అరంగేట్రం చేసి చూపిస్తానని తన సన్నిహితుల దగ్గర సవాళ్లు విసిరినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ ఈ ఇయర్ అయిన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : మోక్షజ్ఞ ను లాంచ్ చేసేది ‘కల్కి’ మూవీ డైరెక్టరేనా..? ప్రశాంత్ వర్మ చేసే సినిమా రెండో మూవీగా రాబోతుందా..?