Mokshagna debut film: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతోంది. అలాంటి వాళ్ల ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత బాలయ్య బాబు ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో బాలయ్య మాస్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో టాప్ హీరోగా మారిపోయాడు. ఇప్పటికి ఆయన మాస్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక బాలయ్య బాబు టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి తన కొడుకు అయిన మోక్షజ్ఞ విషయంలో బాలయ్య చాలా వెనుకబడిపోతున్నాడు. ఇప్పటికి స్టార్ హీరోల కొడుకులందరు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను సాధిస్తుంటే, మోక్షజ్ఞ మాత్రం చాలా సంవత్సరాల నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి అది వర్కౌట్ కావడం లేదు.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనౌన్స్ చెసినప్పటికి అది కార్య రూపం దాల్చలేదు. ఇప్పుడు తన ప్లేస్ లో మరొక స్టార్ డైరెక్టర్ ని తీసుకొచ్చే విధంగా బాలయ్య ప్రణాళికలు రూపొందిస్తున్నాడట. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న ‘మారి సెల్వరాజ్’ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మారి సెల్వరాజ్ రీసెంట్ గా విక్రమ్ కొడుకు అయిన ధృవ్ విక్రమ్ తో బైసన్ అనే సినిమా చేశాడు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక తెలుగు తమిళ్లో ఈ సినిమాకి భారీ గుర్తింపు రావడంతో ఎలాగైనా సరే మారి సెల్వ రాజ్ దర్శకత్వంలో తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని బాలయ్య చూస్తున్నాడు. ఎందుకంటే సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు…కాబట్టి అలాంటి సినిమాలు చేయడం వల్ల మోక్షజ్ఞ మంచి నటుడిగా మారుతాడు బాలయ్య భావిస్తున్నాడు. మొదట నటుడిగా పేరు తెచ్చుకుంటే హీరోగా కూడా మంచి గుర్తింపు వస్తోంది.
కాబట్టి మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ నటుడిగా గుర్తింపు సంపాదించుకుంటే ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేసినా కూడా అతను టాప్ హీరోగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా బానే ఉంది కానీ మారి సెల్వరాజ్ సినిమా చేయాలంటే హీరో విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. మరి మోక్షజ్ఞ కష్టపడుతాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నిజంగానే మోక్షజ్ఞ మొదటి మూవీ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…