Homeఎంటర్టైన్మెంట్Mohan Babu villain in Chiranjeevi movie: చిరంజీవి సినిమాలో విలన్ గా మోహన్ బాబు...

Mohan Babu villain in Chiranjeevi movie: చిరంజీవి సినిమాలో విలన్ గా మోహన్ బాబు…

Mohan Babu villain in Chiranjeevi movie: ఒకప్పుడు కామెడీ విలన్ గా హీరోగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు ప్రస్తుతం మరోసారి విలన్ గా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు కమిట్ అవ్వని మోహన్ బాబు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక అలాగే అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో […]

Mohan Babu villain in Chiranjeevi movie: ఒకప్పుడు కామెడీ విలన్ గా హీరోగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు ప్రస్తుతం మరోసారి విలన్ గా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు కమిట్ అవ్వని మోహన్ బాబు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక అలాగే అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో సైతం తను ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే మోహన్ బాబు ఇప్పుడు విలన్ గా మరింత బిజీగా అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికల్లా మోహన్ బాబు బిజియస్ట్ ఆర్టిస్ట్ గా మారబోతున్నాడు అంటూ చాలామంది కామెంట్లయితే చేస్తున్నారు…

ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మోహన్ బాబు ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక విలన్ గా నటిస్తున్నాడా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయబోతున్నాడా అనే విషయం పక్కన పెడితే మోహన్ బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.

ఇక ఈ స్టోరీని విని మోహన్ బాబు సైతం ఆ పాత్రను చేయడానికి సిద్ధమయ్యాడు అంటే తన పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు…మొత్తానికైతే చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఈ సినిమాతో సైతం మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తుందా? మోహన్ బాబుతో చిరంజీవి ఇంతకుముందు చాలా సందర్భాల్లో నటించినప్పటికి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో సినిమా అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక మోహన్ బాబు ఈ పాత్రతో ఎలా మెప్పిస్తాడు చిరంజీవి ని డామినేట్ చేసే విధంగా యాక్టింగ్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper