Chiranjeevi first review of Sambarala Yeti Gattu: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతుండటం విశేషం… ఇక మెగా ఫ్యామిలీ హీరోలందరు డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… సాయిధరమ్ తేజ్ సైతం ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెట్ గా ఈ క్లైమాక్స్ ఫైట్ ను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా యొక్క రా పుటేజ్ ని మెగాస్టార్ చిరంజీవి చూశారట…ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాలో సైతం ఈ సినిమా పక్కాగా సత్తా చాటుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అందుకే అదే కాన్ఫిడెంట్ తో చిరంజీవికి ఈ సినిమా అనేది చూపించారట. చిరంజీవి కి సినిమా బాగా నచ్చినప్పటికి ఒకటి రెండు విషయాల్లో ఆయన కొన్ని చేంజెస్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది.
Also Read: చిరంజీవి సినిమాలో విలన్ గా మోహన్ బాబు…
ఇక దర్శకుడు సైతం వాటిని చేంజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధించడం లేదు.
అడపదడప సక్సెస్ సాధించినా కూడా తన తోటి హీరోలందరు తనను బీట్ చేసి ముందుకు వెళ్తుంటే సాయిధరమ్ తేజ్ మాత్రం ఇంకా వెనుకబడిపోయాడు…ఇక ఇప్పటికైనా ఆయన మంచి సినిమాలను చేసి సక్సెస్ లను సాధించి టాప్ హీరోగా ఎదిగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఈ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు అనేది…