Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi New Movie With Nag Ashwin: 'కల్కి' డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి..మైథాలజీ కాన్సెప్ట్...

Chiranjeevi New Movie With Nag Ashwin: ‘కల్కి’ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి..మైథాలజీ కాన్సెప్ట్ తో ఈసారికి ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్!

Chiranjeevi New Movie With Nag Ashwin: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇకపై అభిమానులను నిరాశ పరిచే సినిమాలు తీసేలా కనిపించడం లేదు. ఆయన హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ప్లాన్ చేసుకొని తీసినా మెగాస్టార్ అలాంటి ఫ్లాప్ ని అందుకోలేడు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ సినిమా అది. అప్పటి నుండి ఇక చేస్తే భారీ సినిమాలే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. […]

Chiranjeevi New Movie With Nag Ashwin: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇకపై అభిమానులను నిరాశ పరిచే సినిమాలు తీసేలా కనిపించడం లేదు. ఆయన హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ప్లాన్ చేసుకొని తీసినా మెగాస్టార్ అలాంటి ఫ్లాప్ ని అందుకోలేడు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ సినిమా అది. అప్పటి నుండి ఇక చేస్తే భారీ సినిమాలే చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. అందులో భాగంగా ఆయన చేసిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 310 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నాడు.

ఆయన హీరో గా నటించిన గ్రాఫిక్స్ వండర్ ‘విశ్వంభర’ ఎలాగో విడుదలకు సిద్ధం గా ఉంది. ఇది కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం మెగాస్టార్ డైరెక్టర్ బాబీ తో ఒక యాక్షన్ సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే సాధారణంగానే అంచనాలు భారీ గా ఉంటాయి, పైగా యాక్షన్ జానర్ చిత్రమంటే యూత్ ఆడియన్స్ కూడా ఈసారి ఎగబడతారు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయబోతున్నాడు. దీనిపై కూడా అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక స్టోరీ ని వినిపించాడట. ఇది కూడా కల్కి తరహాలోనే మైథాలజీ ని బేస్ చేసుకున్న కథనే. ఈ కథ మెగాస్టార్ కి బాగా నచ్చడం తో, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవ్వగానే ఈ సినిమా చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. గతం లో అశ్వినీదత్ మెగాస్టార్ చిరంజీవి తో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తీసాడు. ఈసారి వీళ్ళ కలయిక లో ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper