spot_img
Homeఎంటర్టైన్మెంట్Mechanic Rocky : ఈ వారం విడుదలైన మెకానిక్ రాకీ, జీబ్రా ఓటీటీలో... ఎప్పుడు?...

Mechanic Rocky : ఈ వారం విడుదలైన మెకానిక్ రాకీ, జీబ్రా ఓటీటీలో… ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Mechanic Rocky : నవంబర్ 22న రెండు చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ఒకటి విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ హీరోగా చేసిన జీబ్రా. ఈ రెండు చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ఫ్లాట్ ఫార్మ్ కి సంబంధించిన డిటైల్స్ లీక్ అయ్యాయి. 
 
దేవర అనంతరం పెద్దల చిత్రాలేవి విడుదల కాలేదు. దాంతో వరుసగా చిన్న హీరోలు తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ వారం ఇద్దరు చిన్న హీరోలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. విశ్వక్ సేన్, సత్యదేవ్ నటించిన చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చాయి. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి మెకానిక్ రాకీ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. శ్రద్ధ శ్రీనాధ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. 
 
మెకానిక్ రాకీ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ పర్లేదు. అలరించే ట్విస్ట్స్ తో కొంత మేర ఆసక్తికరంగా సాగుతుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటిసారి మెకానిక్ రోల్ చేశాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. డిసెంబర్ మూడో వారం లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ కావచ్చట. మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా పెర్ఫార్మ్ చేయని పక్షంలో ఇంకా ముందుకు వచ్చే సూచనలు కలవు. 
 
తన గ్యారేజ్ ని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ చిత్రం. రూ. 50 లక్షలు ఇస్తేనే గ్యారేజ్ ని కూల్చివేయను అని విలన్ సునీల్ కండిషన్ పెడతాడు. అప్పుడు హీరోకి ఎదురైన సమస్యలు ఏంటనేది కథ.. 
 
మరో చిత్రం జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించాడు. సత్యదేవ్ హీరోగా నటించగా.. కన్నడ నటుడు ధనుంజయ మరో ప్రధాన పాత్ర చేశాడు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు. జీబ్రా మూవీ సైతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక జీబ్రా డిజిటల్ రైట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. జీబ్రా వచ్చే నెల రెండో వారం లేదా మూడో వారం స్ట్రీమ్ కానుందట. 
 
జీబ్రా మూవీ కథ పరిశీలిస్తే… హీరో ఓ బ్యాంకు లో ఎంప్లొయ్. తన ప్రేయసి మరొక బ్యాంకు లో పని చేస్తుంది. ఆమె చేసిన మిస్టేక్ వలన హీరోకి సమస్యలు మొదలవుతాయి. హీరో అకౌంట్ లో సడన్ గా నాలుగు కోట్ల రూపాయల డబ్బులు పడతాయి. అవి నావే అని విలన్ రంగంలో దిగుతాడు. ఈ క్రమంలో హీరో, విలన్ మధ్య చోటు చేసుకున్న సంఘర్షణే ఈ చిత్రం.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper