Tourist Family : గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చిన్న సినిమాల హవా అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తమిళం లో అయితే చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చిన్నపాటి సునామీలే సృష్టించాయి. ఏడాది ప్రారంభం లో విడుదలైన ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక ఈ నెల 1వ తేదీన తమిళం లో విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ'(Tourist Family) అనే చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు ట్రైలర్ తోనే ఈ చిత్రం ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేయగా, వాటికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.
అలా విడుదలకు ముందే మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి కూడా రీసెంట్ గానే ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు లోకి కూడా డబ్ చేసి విడుదల చేయాలని మన ఆడియన్స్ బలంగా డిమాండ్ చేశారు. కానీ కుదర్లేదు, కేవలం తమిళ వెర్షన్ లోనే మాత్రమే ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే. ఇక ఓటీటీ వెర్షన్ కోసం మన ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ముందుగా కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి అనుమతిని ఇవ్వాలి.
ఈ నెలాఖరుతో నాలుగు వారాలు పూర్తి అవుతాయి కాబట్టి, మే 31 న జియో+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. తమిళం తో పాటు, తెలుగు, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మన ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ రాబోతుందో చూడాలి. ఈ చిత్రం లో శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలంక నుండి అక్రమంగా తరళి వచ్చి చెన్నై లో నివాసం ఉంటున్న ఒక కుటుంబాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఆ కుటుంబానికి విధించిన శిక్ష, ఆ తర్వాత ఎదురైనా పరిణామాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ సినిమా సాగుతుంది. థియేటర్స్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.