Hari Hara Veeramallu Ticket Rates : రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా హంగామా మొదలైంది. మరో 5 రోజుల్లో ఆయన హీరో గా నటించిన పీరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. మొదట్లో ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ పీరియాడికల్ జానర్ లో సినిమా చేయడమే అందుకు ముఖ్య కారణం. కానీ అనుకోకుండా ఈ సినిమా బాగా ఆలస్యమైంది. రెండు మూడేళ్లు అయితే పర్లేదు, ఏకంగా ఆరేళ్ళు ఆలస్యం అయ్యింది. ఈ గ్యాప్ లో ఓజీ సినిమా ప్రకటన జరిగింది. అభిమానుల ఫోకస్ మొత్తం ఆ సినిమా వైపు షిఫ్ట్ అయ్యింది. దీంతో ‘హరి హర వీరమల్లు’ ని పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయారు.
దానికి తగ్గట్టుగా మేకర్స్ ప్రొమోషన్స్ కూడా చాలా డల్ చేయడం తో అభిమానుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. కానీ ఎప్పుడైతే థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యిందో, అప్పటి నుండి అంచనాలు మళ్ళీ పెరిగాయి. ఈ సినిమాని చాలా తక్కువ అంచనా వేశాము, కానీ మంచి విషయమే ఇందులో ఉన్నట్టుంది అంటూ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్స్ పెంపు కొరకు మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నారు. కాసేపటి క్రితమే జీవో కూడా విడుదలైంది. ఈ సినిమా ‘పుష్ప 2’ తరహాలోనే ప్రీమియర్ షోస్ తో మొదలు కానుంది. అంటే జులై 23 రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి మొదలు అవ్వబోతుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ సినిమాకు దాదాపుగా 8 ఏళ్ళ తర్వాత ఇలా ముందస్తు షో చూసే అదృష్టం అభిమానులకు కలిగింది.
ప్రీమియర్ షోస్ కి ఒక్కో టికెట్ ధర 600 రూపాయిల వరకు ఉంటుందట. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో లోయర్ క్లాస్ టికెట్స్ 100 రూపాయిలు, అప్పర్ క్లాస్ టికెట్స్ 150 రూపాయిల వరకు పెంచుకోవచ్చని, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ పై 200 రూపాయిల వరకు పది రోజుల పాటు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ‘పుష్ప 2’ చిత్రానికి కూడా ఇదే తరహా టికెట్ రేట్స్ ని ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రానికి దాదాపుగా #RRR తో సమానమైన వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా అదే తరహా మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు వస్తాయో లేదో చూడాలి. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దు అనే విధంగా కలెక్షన్స్ ఉంటాయి.
#HariHaraVeeraMallu – AP – Ticket Hikes pic.twitter.com/XqMuR5mARS
— Aakashavaani (@TheAakashavaani) July 19, 2025