Will OTT kill Cinema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఒక హీరోను స్టార్ హీరోగా మార్చడం లో దర్శకుడి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది… సినిమా కథ బావుండి, దర్శకుడు ఆ సినిమాని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజంట్ చేయగలిగితే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తోంది. స్టార్ హీరోలతో సంబంధం లేకుండా కంటెంట్ బెస్ట్ గానే సినిమాలు ఆడుతుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు… ప్రస్తుతం ప్రొడ్యూసర్లు చాలా వరకు నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఓటిటి ప్లాట్ ఫామ్స్ సినిమాల పాలిటా యముడిగా మారాయి. ప్రేక్షకుడు ప్రతి సినిమాని థియేటర్లో చూడకుండా ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం కలిసి వీక్షించే విధంగా అవకాశాన్ని కల్పించాయి. దాంతో పాటుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు థియేటర్లో ఎన్ని రోజులు ఆడాలి. ఆ సినిమా రిలీజ్ అయిన ఎన్ని రోజులకు ఓటిటి లో రిలీజ్ చేయాలి అనే కండిషన్స్ ను కూడా వాళ్లే పెడుతున్నారు. ఇక దీనివల్ల థియేటర్ యజమానులకు భారీగా నష్టాలైతే వస్తున్నాయి. దీనివల్ల చాలా థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గా మారిపోతున్నాయి… ఒకరకంగా ఇండస్ట్రీకి ఓటిటి ప్లాట్ఫారం అనేది చాలా వరకు నష్టాన్ని చేకూరుస్తుందనే చెప్పాలి.
Also Read: 24 గంటల్లో 5 కోట్ల వ్యూస్..ఆల్ టైం సౌత్ ఇండియన్ రికార్డుని నెలకొల్పిన ‘హరి హర వీరమల్లు’
ఓటిటికి ఒక సినిమాని అమ్మడం ద్వారా ఆయా ప్రొడ్యూసర్స్ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉంటున్నప్పటికి థియేటర్లో సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకున్న ప్రేక్షకులు అలాగే థియేటర్ ని నడిపించి మంచి ప్రాఫిట్స్ ని అందుకుందాం అనుకున్న ఎగ్జిబ్యూటర్లకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తున్నాయి…
ఓటిటి కోసమే సపరేట్ గా తీసే సినిమాలకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతోంది. కానీ థియేటర్ సినిమాలకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సినియాలు థియేటర్ కి వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే ఓటిటికి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కి రావడం మొత్తానికే మానేశారు. ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడొచ్చులే అంటూ లైట్ తీసుకుంటున్నారు… ఇక దానికి తోడుగా టికెట్ల రేట్లు పెంచడం కూడా ప్రేక్షకుడిని థియేటర్ కి రానివ్వకుండా ఆపేస్తున్నాయి…
Also Read: బుక్స్ చదువుతూ కూడా ఇంత హాట్ షోనా అమ్మడూ..?
మొత్తానికైతే ఓటిటి అనేది కొంతమంది ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ ను అందిస్తుంటే డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిక్యూటర్ల కి మాత్రం భారీగా నష్టాలను చేకూరుస్తున్నాయి. ఇవన్నీ కలిసి మొత్తానికైతే సినిమాని చంపేస్తున్నాయనే చెప్పాలి…ఇప్పటికైనా ప్రొడ్యూసర్స్ లో చైతన్యం వచ్చి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించి ఇండస్ట్రీ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ లను సైతం ప్రాఫిట్స్ లో ఉంచే విధంగా నిర్ణయాలు చేసుకుంటే మంచిది…