OTT: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లను డామినేట్ చేస్తూ ఓటిటి సంస్థ వీర విహారం చేస్తోంది. సినిమా థియేటర్లతో సంబంధం లేకుండా ఓటిటికి సపరేట్ ఒక డేట్ ని కేటాయించాలంటూ వాళ్ల నిర్ణయాలను వాళ్ళు ప్రొడ్యూసర్ల ముందు ఉంచారు. ఇక దానికి ఏం చేయాలో తెలియని ప్రొడ్యూసర్లు తలవంచి ఓటిటి ఏం చెబితే అది చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో హీరోలు సైతం ఏం చేయలేకపోతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్గా ‘హరిహర వీరమల్లు ‘ సినిమా విషయంలో ఇదే జరిగింది. హరిహర వీరమల్లు సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదంటూ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ కి ఇవ్వాల్సిన డబ్బులు కొంత వరకు కట్ చేసి ఇస్తామంటూ ప్రొడ్యూసర్ ను బెదిరించారు. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకే ఇలాంటి బెదిరింపులు వచ్చాయి అంటే మిగతా హీరోల సినిమాల విషయంలో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.
మరి ప్రొడ్యూసర్లు సైతం ఎందుకని ఓటిటి కండిషన్స్ కి తలవంచుతున్నారు. ఓటిటి లేకముందు సినిమాలు నడవలేదా అందరు ప్రొడ్యూసర్స్ కలిసి ఓటిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఆసన్నమైంది. లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో థియేటర్లన్నీ క్లోజ్ అయిపోయి కేవలం ఓటిటి లోనే సినిమాలు చూసే రోజులు అయితే వస్తాయి.
కాబట్టి దీనికి చరమగీతం పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఓటిటి ని లైట్ తీసుకుంటే మాత్రం ప్యూచర్ లో జరగబోయేది ఇదే అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం హెచ్చరిస్తున్నారు. ఓటిటి సంస్థలు సినిమాల మీద తమ ఆధిపత్యాన్ని చూపించాలి అనుకుంటున్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.
ఇక స్టార్ హీరోలు సైతం ఈ విషయం మీద కొంత వరకు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది…ఇక సినిమా రిలీజ్ అయిన వారంలో ఓటిటి లోకి వస్తుంటే సినిమాని థియేటర్లో చూడాలని కోరుకునే అభిమానుల పరిస్థితి ఏంటి అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…చూడాలి మరి దీని మీద ప్రొడ్యూసర్స్ ఎలా స్పందిస్తారు… వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది…