Bollywood Actor Amol Parashar Journey: ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరో కూడా ఐఐటీ జేఈఈ ఆల్ ఇండియా 238 వ ర్యాంకును సాధించడం జరిగింది. ఇతను ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత ఒక ఎమ్మెల్సీ కంపెనీలో లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం చేసేవాడు. చాలామంది తమ కుటుంబం కోసం లేదా ఇతర కారణాల వలన తమకు నచ్చకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యే కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి డబ్బులు వస్తున్నాయి కదా అని వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు. కానీ మనం చెప్పుకోబోయే హీరో మాత్రం అలా చేయలేదు. ఉద్యోగం చేయడం అతనికి ఇష్టం లేదు. హీరోగా కనిపించాలి అనే ఉద్దేశంతో లక్షల జీతం ఉన్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసాడు. కెరియర్ ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ముఖ్యంగా ఈ హీరోకు ఓటీటీలో బాగా క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఓటీటీలలో ఇతని సినిమా లేదా వెబ్ సిరీస్ వస్తుందంటే చాలు రికార్డ్స్ క్రియేట్ అవుతాయి.
Also Read: Katrina Kaif Beauty Secret: కత్రినా కైఫ్ అందానికి రహస్యం ఏంటి? రోజు ఏం చేస్తుంటుంది?
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇతను తరచూ వార్తల్లో కూడా ఉంటున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతోనే కాకుండా ప్రేమ, డేటింగ్, రిలేషన్ షిప్ వంటి వాటిలో కూడా ఈ హీరో ప్రస్తుతం వార్తల్లో ఉంటున్నాడు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటే పెద్ద అయినా నటితో ఇతను ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇతని గురించి అంతగా పరిచయం ఉండకపోవచ్చు కానీ బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు మాత్రం ఈ హీరో బాగా పరిచయం. ఈ హీరో పేరు అమోల్ పరాశర్. అమోల్ ఢిల్లీలో సెప్టెంబర్ 17, 1986లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఇతను చదువులో టాపర్. ఐఐటీలో ఆల్ ఇండియా లెవెల్ లో 238వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశాడు.
ఆ తర్వాత జెడ్ ఎస్ అసోసియేట్స్ అనే ఒక గ్లోబల్ కన్సల్టింగ్ ఫార్ములా లక్షల జీతంతో ఉద్యోగం చేసేవాడు. కానీ తనకు నటనపై ఉన్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి రాకెట్ సింగ్ సేల్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో 2009లో బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అమోల్ సినిమా కెరియర్ను టీవీ ఎఫ్ ట్రిప్లింగ్ అనే వెబ్ సిరీస్ మలుపు తిప్పింది. అలాగే డాలి చిట్టి ఆర్ వో చమక్తే సితారే, సర్దార్ ఉదం, క్యాష్, 36 ఫామ్ హౌస్, స్వీట్ డ్రీమ్స్ వంటి సినిమాలలో అమోల్ కీలక పాత్రలలో నటించాడు.
View this post on Instagram