Maruthi: ఈమధ్య కాలంలో డైరెక్టర్ మారుతీ పై వచ్చినన్ని ట్రోల్స్ సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ మీద కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రోల్స్ మాత్రమే కాదు, ఆయనపై చాలా నిందలు కూడా వచ్చాయి. ప్రభాస్ తో సినిమా ఒప్పుకోడమే ఆయన చేసిన పెద్ద తప్పు అనుకోవచ్చు. ఆయన రేంజ్ కి తగ్గట్టుగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లుంటే ఈరోజు ఇన్ని అవమానాలకు గురి కావాల్సిన దుస్థితి వచ్చేది కాదు. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం రావడం ఒక అదృష్టం, అదే సమయం ఆయన కెరీర్ కి డేంజర్ బెల్స్ కూడా అనేది మారుతీ మొదటి రోజు షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే మంచిగా సినిమా తీస్తే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఒకవేళ చెత్తగా తీస్తే కెరీర్ క్లోజ్ అయ్యినట్టే అనే విషయాన్నీ ముందే గ్రహించి ఉండుంటే వళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేసి ఉండేవాడు.
‘రాజా సాబ్’ చిత్రం తర్వాత మారుతీ ఇక ఇండస్ట్రీ లో కనిపించడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు మెగాస్టార్ ఫ్యామిలీ లోని కొంత మంది హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండడంతో మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ హీరోగా, మారుతీ దర్శకత్వం లో ఒక సినిమా మొదలు కాబోతుందట. మారుతీ తీవ్రమైన డిప్రెషన్ లో ఉండదాన్ని గమనించిన హీరో సాయి ధరమ్ తేజ్, మారుతీ కి ఫోన్ చేసి, బాధపడకండి, మంచి స్టోరీ ఉంటే చూడండి, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని మాట ఇచ్చాడట. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రతి రోజు పండగే అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి మంచి బ్రేక్ ఇచ్చింది ఈ చిత్రం.
ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ లో తెరకెక్కింది. బన్నీ వాసు దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ సంస్థనే నిర్మిస్తుందట. అయితే ఇది కామెడీ జానర్ సినిమానా?, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైనర్? అనేది తెలియాల్సి ఉంది. అయితే పక్కా కమర్షియల్ సినిమా చూసినప్పుడే మారుతీ లో పస అయిపోయింది అనే విషయం అర్థమైంది. మ్యానేజ్మెంట్ కోటాలో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన పనితనం చూసిన తర్వాత కూడా ఇంకో అవకాశం ఇవ్వడం టూ మచ్. ఇతనికి అవకాశం ఇచ్చి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకునే బదులు, యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వొచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్.