Mana Shankara Varaprasad Garu OTT: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం విడుదలై 22 రోజులు పూర్తి అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తోంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 22వ రోజున 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. పాన్ ఇండియన్ సినిమాలు సైతం మూడు వారాల తర్వాత బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ అవ్వడం ఆగిపోతున్న రోజులివి. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నాల్గవ వారం లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ట్రెండ్ అవుతుంది అంటే సాధారణమైన విషయం కాదు. మరో వారం రోజులపాటు థియేట్రికల్ రన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడే ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. ఇది అభిమానులకు అసలు నచ్చడం లేదు.
ఈ చిత్రాన్ని ‘జీ 5’ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇదొక ఆల్ టైం రికార్డు గా భావించవచ్చు. అనిల్ రావిపూడి గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని కూడా ‘జీ 5’ సంస్థనే కొనుగోలు చేసింది. ఈ చిత్రం ‘జీ5’ యాప్ లో దాదాపుగా ఆరు నెలల పాటు ట్రెండ్ అయ్యింది. వ్యూస్ కూడా #RRR రేంజ్ లో వచ్చాయి, అద్భుతమైన లాభాలు వచ్చాయి కాబట్టే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ని నిర్మాతలు అడిగిన రేట్ కి కొనుక్కున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 11 న ‘జీ5’ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి. మార్చి 11 అంటే, సరిగ్గా 28 రోజులు (4 వారాలు) పూర్తి అయ్యి, 29 వ రోజు అన్నమాట.
అందుకే ఆ తేదీన విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు ముందుగా కుదిరించుకున్న ఒప్పందం కాబట్టి, దీనిని మార్చే అవకాశాలు కూడా లేదు. తెలుగు తో పాటు, హిందీ , తమిళం,మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం మార్చి 11 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఓటీటీ లోకి వచ్చినప్పటికీ, ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకునే ఆడియన్స్ ఉంటారని, చాలా సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్స్ లో రన్ అయ్యాయి కాబట్టి, అభిమానులు రన్ ఆగిపోతుంది అనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.