Homeఎంటర్టైన్మెంట్BB Jodi 2 Telugu Srija: పాపం శ్రీజ.. 'బిగ్ బాస్ 9 'లో...

BB Jodi 2 Telugu Srija: పాపం శ్రీజ.. ‘బిగ్ బాస్ 9 ‘లో అలా, ఇప్పుడు ‘BB జోడి 2’ లో ఇలా..ఆమె బ్యాడ్ లక్ మాములుగా లేదుగా!

BB Jodi 2 Telugu Srija: ‘బిగ్ బాస్ 9’ షో ముగిసిన తర్వాత స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘BB జోడి 2’ డ్యాన్స్ షోకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి 9వ సీజన్ వరకు కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారికి ఈ షోలో అవకాశం కల్పించారు. అయితే షో ఫార్మటు ప్రకారం రెండు వారాలకు ఒకసారి కంటెస్టెంట్స్ కి వచ్చిన మార్కులను […]

BB Jodi 2 Telugu Srija: ‘బిగ్ బాస్ 9’ షో ముగిసిన తర్వాత స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘BB జోడి 2’ డ్యాన్స్ షోకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి 9వ సీజన్ వరకు కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారికి ఈ షోలో అవకాశం కల్పించారు. అయితే షో ఫార్మటు ప్రకారం రెండు వారాలకు ఒకసారి కంటెస్టెంట్స్ కి వచ్చిన మార్కులను పరిశీలించి, అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన చివరి రెండు జంటలకు ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ని నిర్వహించి, ఈ ఛాలెంజ్ లో ఎవరైతే తక్కువ మార్కులను స్కోర్ చేసారో, ఆ జంట ని ఎలిమినేట్ చెయ్యాలి. మొదటి రెండు వారాల తర్వాత శ్రీ సత్య, అర్జున్ మరియు నేహా, విశ్వ జంటలు ఫేస్ ఆఫ్ కి వచ్చారు. కానీ ఆ వారం ఎలిమినేషన్ ని రద్దు చేశారు.

మరో రెండు వారాల తర్వాత కచ్చితంగా ఎలిమినేషన్ ఉందని అనుకున్నారు. ఈసారి ధనరాజ్, భాను జంటకు, రీతూ, డిమోన్ పవన్ జంటకు ఫేస్ ఆఫ్ పడింది. ఈ ఫేస్ ఆఫ్ లో రీతూ, డిమోన్ పవన్ జంట గెలిచారు ,కానీ జడ్జీలు మరోసారి ఎలిమినేషన్ ని రద్దు చేశారు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తోంది. ఈ ఆదివారం టెలికాస్ట్ అవ్వబోయే ఈ ఎపిసోడ్ లో ఆర్జే చైతు, శ్రీజ జంట ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. మొదటి నాలుగు వారాలు చైతు, కీర్తి భట్ జంటగా డ్యాన్స్ వేస్తూ వచ్చారు. కానీ కీర్తి కి కాళ్ళు దెబ్బ తినడంతో పాటు, ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడం ఆమె ఈ షో నుండి తప్పుకుంది.

దీంతో ఆమె స్థానం లోకి శ్రీజా ఎంట్రీ ఇచ్చింది. వీళ్లిద్దరు గత వారం పెర్ఫార్మ్ చేశారు, పర్వాలేదు అనిపించుకున్నారు. కానీ ఈ వారం వీళ్లిద్దరి పెర్ఫార్మన్స్ జడ్జీలకు ఏ మాత్రం నచ్చలేదు. వాళ్ళ వైపు నుండి తక్కువ మార్కులు రావడం, అదే విధంగా కంటెస్టెంట్స్ కూడా తక్కువ మార్కులు ఇవ్వడంతో ఈ జంట ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ కి వచ్చింది. రీతూ, డిమోన్ పవన్ జంట తో పోటీ పడిన ఈ జంట ఓడిపోయింది. అయితే శ్రీజ కి బ్యాడ్ లక్ మామూలుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ 9 లో ఆమె ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవ్వలేదు, మ్యానేజ్మెంట్ చేసిన అన్యాయం వల్ల ఎలిమినేట్, ఇక ఈ డ్యాన్స్ షో లో కేవలం ఆమె రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వడం దురదృష్టకరం. ఎక్కడో ఆమెకు అదృష్ట రేఖ సినీ రంగం పరంగా సరిగా లేదని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper