Mana Shankara Varaprasad Garu 50 days celebrations: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం నెల రోజుల థియేట్రికల్ రన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లతో ముందుకు దూసుకుపోతోంది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేశారు. సినిమా రన్ మొత్తం అయిపోయింది, ఇక ఓటీటీ లోనే మిగిలిన ఆడియన్స్ చూస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం 31 వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల నుండి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట. ఇలా ఒక సినిమాకు నెల రోజులకు పైగా థియేట్రికల్ రన్ రావడం చూసి ఎన్ని రోజులు అయ్యిందో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు 50 రోజుల కేంద్రాలు కూడా భారీ రేంజ్ లోనే ఉండబోతున్నాయని తెలుస్తోంది.
శివ రాత్రి పూర్తి అయ్యే వరకు ఈ చిత్రానికి గణనీయమైన థియేట్రికల్ షేర్స్ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత కూడా రన్ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. అందుకే ప్రతీ జిల్లాలోనూ ఈ చిత్రం మెయిన్ సెంటర్స్ తో పాటు, కొన్ని B,C సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ చిత్రం కచ్చితంగా వందకి పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయట. అందుకే మేకర్స్ ఎట్టి పరిస్థితిలోనూ 50 రోజుల ఫంక్షన్ చెయ్యాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మన టాలీవుడ్ లో ఇలా అర్థ శతదినోత్సవం జరుపుకొని ఎన్నో ఏళ్ళు అయ్యింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఆ వేడుక జరుపుకోకుంటే చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశ్యంతో ఈ వేడుక ని ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారట.
మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసే అవకాశాలు ఉన్నాయట. విజయవాడ లోనే ఈ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా అభిమానులకు, మూవీ లవర్స్ కి ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియన్ చిత్రాలు దేవర, ఓజీ, సలార్, కల్కి వంటి చిత్రాలే 50 రోజులు థియేటర్స్ లో నిలబడలేకపోయాయి, అలాంటిది ఒక ప్రాంతీయ బాషా చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి సాధించిన ఈ రికార్డు ని చూస్తుంటే, రాజా సాబ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన ‘ఎంతైనా సీనియర్ సీనియరే..వాళ్ళ తర్వాతే మేము’ అనే మాట గుర్తుకొచ్చింది.