Mana Shankara Varaprasad Garu completes 50 days: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 సినిమాలతో పోటీ పడి , 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గానే ఓటీటీ లో విడులైంది, గత శనివారం జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ కూడా అయ్యింది. రెండిట్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని , 100 రోజుల వైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ సినిమా ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుందో జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రం కేవలం రెండు సెంటర్స్ లో మాత్రమే 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 35 MM థియేటర్ మరియు నిజామాబాద్ లోని లలిత మహాల్ థియేటర్ లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే చిరంజీవి కి మొదటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం కంచుకోట లాంటిది అని అంటుంటారు. అలా ఎందుకు అంటారో ఈ సినిమా హిస్టారికల్ రన్ ని చూసి చెప్పొచ్చు . ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం లో 25 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది . ఈమధ్య కాలం లో ఏ సినిమా కూడా ఈ ప్రాంతంలో ఇంత రన్ ని సొంతం చేసుకోలేదు .
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదంటూ హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్!
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా లో 7 సెంటర్స్ లో 50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , వెస్ట్ గోదావరి జిల్లా నుండి రెండు సెంటర్లు, గుంటూరు జిల్లా నుండి 4 సెంటర్లు ,. కృష్ణ జిల్లా నుండి 4 సెంటర్లు , నెల్లూరు జిల్లా నుండి 4 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక చిరంజీవి మరో బలమైన ప్రాంతం అయినటువంటి రాయలసీమ లో 13 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోగా, కర్ణాటక ప్రాంతం లో 5 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం మీద ఈ చిత్రం 66 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. షిఫ్ట్ సెంటర్స్ ని కూడా కలిపితే వందకి పైగా ఉండొచ్చు. #RRR చిత్రం 54 సెంటర్స్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంటే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ 66 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.