Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: 'వారణాసి' మూవీలో మహేష్ బాబు కొడుకు నటిస్తున్నాడా... ఏం ప్లాన్ చేశావ్ రాజమౌళి...

Mahesh Babu: ‘వారణాసి’ మూవీలో మహేష్ బాబు కొడుకు నటిస్తున్నాడా… ఏం ప్లాన్ చేశావ్ రాజమౌళి…

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకు ధీరుడిగా గా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడట. రాజమౌళి ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తూ సినిమా బాగా రావడానికి చాలా వరకు […]

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకు ధీరుడిగా గా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడట. రాజమౌళి ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తూ సినిమా బాగా రావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు రాజమౌళికి అపజయం అనేది లేదు. కాబట్టి వారణాసి సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. రాజమౌళి ఏరికోరి మరి గౌతమ్ ని ఒక ప్రత్యేకమైన పాత్రలో తీసుకున్నారట.

ఇంతకీ ఆ పాత్ర ఏంటి అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికి ఈ సినిమా తోనే ఆ క్యారెక్టర్ ఏంటనేది థియేటర్లోనే రివిల్ చేయాలని చూస్తున్నారట. రాజమౌళి గౌతమ్ కృష్ణ ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి మహేష్ బాబు గౌతమ్ మధ్య ఎలాంటి సీన్స్ రాసుకున్నారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మొత్తానికైతే మహేష్ బాబు వారసుడు అయిన గౌతమ్ కృష్ణ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇలాంటి క్రమంలో రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి తన కొడుకు పరిచయం అవుతుండడం నిజంగా చాలా గొప్ప విషయమని అతను అనుకుంటున్నాడట.

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుతో ఢీకొనే పాత్రలో గౌతం కృష్ణ నటిస్తున్నాడా? లేదంటే మహేష్ బాబు కి హెల్ప్ చేస్తే క్యారెక్టర్ లో నటించబోతున్నాడా? ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సస్పెన్స్ కి తెర దించాలి అంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే…

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper