Homeఎంటర్టైన్మెంట్బన్నీ సెట్ లో మహేష్.. పిక్స్ వైరల్ !

బన్నీ సెట్ లో మహేష్.. పిక్స్ వైరల్ !

‘పుష్ప’ సెట్ లో మహేష్ బాబు కనిపించారు. మహేష్ ను చూసిన పుష్ప టీమ్ తెగ సంబర పడిపోతూ మహేష్ ఫోటోలను తీసి తెగ హడావిడి చేశారు. ఇంతకీ మహేష్ పుష్ప సెట్ కి ఎందుకు వెళ్ళాడు అంటే.. సుకుమార్ కోసం అట. మహేష్ తన ‘సర్కారు వారి పాట’ షూట్ కి వెళ్తూ.. మధ్యలో పుష్ప సెట్ ఉంటే.. అటు వైపు వెళ్లారు. మొత్తానికి పుష్ప షూటింగ్ స్పాట్ లో సుకుమార్ తో సూపర్ స్టార్ […]

Mahesh Babu At Pushpa Shooting Spot‘పుష్ప’ సెట్ లో మహేష్ బాబు కనిపించారు. మహేష్ ను చూసిన పుష్ప టీమ్ తెగ సంబర పడిపోతూ మహేష్ ఫోటోలను తీసి తెగ హడావిడి చేశారు. ఇంతకీ మహేష్ పుష్ప సెట్ కి ఎందుకు వెళ్ళాడు అంటే.. సుకుమార్ కోసం అట. మహేష్ తన ‘సర్కారు వారి పాట’ షూట్ కి వెళ్తూ.. మధ్యలో పుష్ప సెట్ ఉంటే.. అటు వైపు వెళ్లారు. మొత్తానికి పుష్ప షూటింగ్ స్పాట్ లో సుకుమార్ తో సూపర్ స్టార్ కాసేపు ముచ్చట్లు పెట్టారు.

అనంతరం అల్లు అర్జున్ తో కూడా మహేష్ సరదాగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ – సుకుమార పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక పాన్ ఇండియా మంత్రం వల్లిస్తూ సుకుమార్ ఈ సినిమా చేస్తోన్నాడు. ప్రస్తుతం “పుష్ప” పార్ట్ 1 నుండి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ ను వదలడానికి సిద్ధం అయింది టీమ్.

ఆ సాంగే “దాక్కో దాక్కో మేక”ను అంటూ సాగనుంది. ఆగస్టు 13న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను కూడా వదిలారు. ప్రోమోలో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా బన్నీ కత్తిని నోటిలో పెట్టుకుని పూర్తి రఫ్ లుక్ లో కనిపించి మాస్ ఆడియన్స్ కు ఫుల్ కిక ఇచ్చాడు. ఈ ప్రోమోతో ఈ పాట పై భారీ అంచనాలు పెరిగాయి.

అయితే, ఆ అంచనాలకు తగ్గట్టు ఈ పాట ఉంటుందట. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకుల చేత రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను అద్భుతంగా పాడించి ప్రత్యేకంగా ఈ పాటను కంపోజ్ చేశారు. దేవి చాలా రోజులు కష్టపడి ఈ పాటను క్రియేట్ చేశాడు కాబట్టి.. కచ్చితంగా సాంగ్ అదిరిపోతోంది. ఇక ఈ సినిమా బన్నీ – సుకుమార్ కెరీర్ లోనే అతి పెద్ద సినిమా.

అందుకే, ఈ సినిమా పై బన్నీ – సుకుమార్ ఇద్దరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పుష్ప పార్ట్ 1 కి ఎలాంటి పోటీ లేకుండా డిసెంబర్ లో సినిమాని రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper