spot_img
Homeఎంటర్టైన్మెంట్షాక్: సినీ ప్రముఖుడు మృతి, ఎన్టీఆర్ ఎమోషనల్!

షాక్: సినీ ప్రముఖుడు మృతి, ఎన్టీఆర్ ఎమోషనల్!

NTR-B.A Raju
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలిచివేస్తోంది. నిన్న రాత్రి ప్రముఖ పిఆర్ఓ మరియు నిర్మాత బి.ఏ రాజు ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనకు ఉన్నట్టు ఉండి సడెన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించడం దురదృష్టకరం.

తెలుగు చిత్రసీమలోని ప్రముఖులంతా ఆయన మరణం పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన నివాళులు అర్పిస్తూ బి.ఏ రాజుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వార్త తనని షాక్ కు గురి చేసిందని, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా మరియు పిఆర్ఓ గా ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా చేసారని, అదే విధంగా తన కెరీర్ ఆరంభం రోజుల నుంచే ఆయన తనకు తెలుసు అని ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు.

అలాంటి వ్యక్తి ఇపుడు లేకపోవడం మనకు అతి పెద్ద లోటు అని, వారి కుటుంబం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. గత కొద్ది రోజులుగా బి.ఏ రాజు గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు, కానీ సడెన్ గా ఇలా ఉన్నట్టు ఉండి ప్రాణాలను కోల్పోవడం బాధాకరమైన విషయం.

ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున బి.ఏ రాజుగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper