Channel : తెలంగాణ యాస ఆధారంగా ఏర్పడిన ఆ ఛానల్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించింది. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక తెలంగాణ యాసకు పట్టం కట్టింది. తెలంగాణ భాష అవమానాలకు గురవుతున్న సందర్భంలో నడుంబిగించి సరికొత్త కార్యక్రమాలను నిర్వహించింది. అనతి కాలంలోనే తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అందువల్లే ఆ ఛానల్ అంటే ప్రజలు విపరీతమైన ఇష్టం చూపించేవారు. ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రకరకాల పొలిటికల్ కండువాలు మార్చినప్పటికీ.. ఆ చానల్ ను మాత్రం ఆదరించడంలో ప్రజలు ఏమాత్రం పక్షపాతాన్ని ప్రదర్శించలేదు. తెలంగాణ యాసకు.. తెలంగాణ భాషకు పట్టం కట్టడంలో తిరుగులేని స్థాయిని ప్రదర్శించిన ఆ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్స్ ఇవే..
అంతా వారేనట
తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆ చానల్లో కీలక శాఖలో ఓ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే పనిచేస్తున్నారట. వాస్తవానికి ఆ ఛానల్ యాజమాన్యం మొదటి నుంచి కూడా తెలంగాణకు దృశ్యరూపం అని ట్యాగ్ లైన్ పెట్టుకుంది. బతుకమ్మ, బోనాలు పండగల సందర్భంగా ప్రత్యేక గీతాలు రూపొందించి తెలంగాణ ప్రజల మనసును గెలుచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ చానల్లో కీలక శాఖలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడు మాత్రమే కాదు అన్ని విభాగాలలోనూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ విషయాలను ఓ యూట్యూబ్ జర్నలిస్టు బయటపెట్టాడు..” ఆ చానల్లో అన్ని శాఖల్లోనూ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు పనిచేస్తున్నారు. తెలంగాణ వారికి అందులో అవకాశం లేదు కిందిస్థాయిలో మాత్రమే తెలంగాణ వారు పనిచేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు మేనేజ్మెంట్ ప్రశ్నించినప్పుడు.. వారు ఉంటే ఉండండి పోతే పోండి అని సమాధానం చెప్పారు. అందువల్లే చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అందులో పని చేయలేకపోతున్నారు. దీంతో కింది నుంచి పై దాకా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మాత్రమే అక్కడ నిండిపోయారు. ఇక్కడ ఛానల్ ఏర్పాటు చేశారు కాబట్టి.. ఆదాయాన్ని సంపాదించుకోవాలి కాబట్టి.. తెలంగాణ యాసకు పట్టం కడుతున్నామని పైకి మాటలు చెబుతున్నారు. కానీ తెలంగాణ యాస పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అందువల్లే ఆ చానల్ యాజమాన్యం తీరు పట్ల తమకు ఆగ్రహం గా ఉందని” ఆ యూట్యూబ్ జర్నలిస్టు పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో ఆ ఛానల్ యాజమాన్యం ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
Also Read : ఏపీలో మూడు ఛానళ్లపై అనధికార నిషేధం!
V6 న్యూస్ లో పనిచెయ్యడానికి తేలంగాణ జర్నలిస్టులు పనికి రారా !
తేలంగాణ జర్నలిస్టులు పై ఎందుకి వివక్ష ! #Telangana #Congress #BRSParty
Credits : @SignalTVtelugu pic.twitter.com/uwjXfb2cIO
— Telangana (@Telangana_1883) March 16, 2025