Homeఎంటర్టైన్మెంట్Varun Tej: కొడుకు ఫోటో ని బయటపెట్టిన వరుణ్ తేజ్.. అచ్చం ఎవరి పోలికో తెలుసా..

Varun Tej: కొడుకు ఫోటో ని బయటపెట్టిన వరుణ్ తేజ్.. అచ్చం ఎవరి పోలికో తెలుసా..

Varun Tej: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండి డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట, ఒక్కసారిగా మేము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడం ఆడియన్స్ కి ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే అప్పటి వరకు వీళ్లిద్దరు మేము డేటింగ్ లో ఉన్నాము అనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షం లో 2023 వ […]

Varun Tej: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండి డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట, ఒక్కసారిగా మేము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించడం ఆడియన్స్ కి ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే అప్పటి వరకు వీళ్లిద్దరు మేము డేటింగ్ లో ఉన్నాము అనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షం లో 2023 వ సంవత్సరం నవంబర్ 1 న వీళ్లిద్దరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. అప్పటి నుండి ఎంతో అన్యోయంగా జీవిస్తూ వస్తున్న ఈ జంట కి గత ఏడాది సెప్టెంబర్ 10 న కొడుకు పుట్టాడు. ఈ బిడ్డకు వాయువ్ తేజ్ అనే పేరు పెట్టారు. వాయువ్ తేజ్ పుట్టి సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి తమ కొడుకు ముఖాన్ని అభిమానులకు రివీల్ చేశారు.

అంతే కాకుండా వరుణ్ తేజ్ ఇదే వయస్సు లో తన తల్లిదండ్రులు తనతో దిగిన ఫోటో ని క్లబ్ చేసాడు. అయితే వాయువ్ తేజ్ లో మాత్రం వరుణ్ పోలికల కంటే, లావణ్య త్రిపాఠి పోలికలే ఎక్కువ ఉన్నాయి అంటూ , సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి దగ్గర పోలికలతో పుట్టడం చాలా అరుదు అనే చెప్పాలి. ఇకపోతే వాయువ్ తేజ్ పుట్టిన తర్వాత వరుణ్ తేజ్ కి చాలా కలిసొచ్చింది. అంతకు ముందు ఆయన ఐదేళ్ల నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్నాడు. కానీ వాయువ్ తేజ్ పుట్టిన వేళా విశేషం, వరుణ్ తేజ్ కి ‘కొరియన్ కనకరాజు’ వంటి భారీ హిట్ తగిలింది. భవిష్యత్తు లో కూడా అద్భుతమైన లైనప్ ని సెట్ చేసుకున్నాడు వరుణ్.

చూడాలి మరి వరుణ్ తేజ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించబోతున్న ‘బరి ‘ అనే చిత్రం లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు అట. ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందించిన యాదు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తమిళ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే వరుణ్ తేజ్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది అని చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper