Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: డైరెక్టర్ గా మారిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాలో హీరో ఎవరో చూస్తే...

Kiran Abbavaram: డైరెక్టర్ గా మారిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాలో హీరో ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం . ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘క’, ‘k ర్యాంప్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మధ్యలో […]

Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం . ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘క’, ‘k ర్యాంప్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి కానీ , చాలా తొందరగానే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే హీరో గా తనని తానూ నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం , ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇది ఆయన 13 వ సినిమా అట. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ చిత్రం లో హోటల్ ఓనర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నాడు. జాయ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం మంచిగా హీరో గా కొనసాగుతున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు. కానీ కిరణ్ అబ్బవరం కేవలం హీరో మాత్రమే కాదు , ఒకప్పుడు రైటర్ గా కూడా పని చేశాడు. తన మొట్టమొదటి కమర్షియల్ సూపర్ హిట్ ‘SR కళ్యాణ మండపం’ కి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ రాసింది మరెవరో కాదు , కిరణ్ అబ్బవరమే. ఈ సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఈ విషయాన్నీ గమనించొచ్చు. అంతే కాకుండా , హీరో అవ్వకముందు ఆయన ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే డైరెక్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఆయన ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper