Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ , రోజుకొక సంచలన రికార్డు ని నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ చిత్రం కేవలం తెలుగు , తమిళం భాషల్లోనే కాదు , హిందీ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం 40 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలై సూపర్ హిట్స్ గా నిల్చిన అన్ని చిత్రాల గ్రాస్ వసూళ్లను కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసి ఆల్ టైం టాప్ 2 ఇండియన్ గ్రాసర్ గా ముందుకెళ్తోంది. మొదటి స్థానం లో ‘ధురంధర్ 2’ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 88 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నేటితో ఈ చిత్రం ఆ ప్రాంతం లో 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాల నుండి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కేరళ నుండి 40 కోట్ల రూపాయిలు , కర్ణాటక నుండి 40 కోట్ల రూపాయిలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి కేవలం నాలుగు రోజుల్లోనే 20 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 190 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 427 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ చిత్రానికి నేడు కూడా అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. నేటితో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది. జైలర్ చిత్రానికి క్లోజింగ్ లో 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి , కానీ ‘జైలర్ 2’ కి మొదటి వారం లోనే 650 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.