Katrina Kaif Marriage: బాలీవుడ్లో గత రెండువారాలుగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం గురించే. బాలీవుడ్ క్యూట్ లవ్ కపుల్‌గా ఉన్న వీరిద్దరు ఇటీవలే పెళ్లిపీటలెక్కి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వీరి పెళ్లి జరుగుతుందా జరగదా అన్న అంశంపై సోషల్‌మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతుండగా.. పెళ్లికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో అభిమానులకు పోస్ట్ చేసి ప్రపంచానికి తెలియజేశారు. ఈ వివాహం వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హజరయ్యారు.
అయితే పెళలి తర్వాత కత్రినా కైఫ్, విక్కీల వివాహానికి చేసిన ఖర్చుతోపాటు, వారి హనీమూన్ గురించి సోషల్‌మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతునే ఉన్నాయి. తాజాగా సమాచారం ప్రకారం. వీరిద్దరు హనీమూన్ కోసం యూరప్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐరోపాలో కేవళం ఒకటో రెండో కాదట. మొత్తం యూరప్‌నే చుట్టి రానున్నట్లు సమాచారం. అందులో వీరి హనీమూన్ కనీసం రెండు నెలలు కొనసాగుతుందని అంటున్నారు. ఈ హనీమూన్ ప్లాన్ మొత్తం విక్కీనేదట. పెళ్లి పూర్తిగా కత్రినా ఇష్టప్రకారమే జరగడం వల్ల హనీమూన్ ట్రిప్ మాత్రం విక్కీకి నచ్చినట్లుగా ప్లాన్ చేసినట్లు సమాచారం.
మరోవైపు కత్రినా నిశ్చితార్థం రోజు ధరించిన ఉంగరంపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. నీలమనితో రూపొందించిన ఆ రింగ్ లక్షల్లో ఖరీదు చేస్తుందని అంటున్నారు. దీంతో పాటు మంగళసూత్రం కూాడా లక్షల్లోనే ఉంటుందని అంచనా. ఇలా వారు పెళ్లికి వేసుకున్న డ్రస్, నగలు అన్నింటిపైనా నెటిజన్లు తమ అంచనాలకు తగ్గట్లు మాట్లాడుకుంటున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Katrina kaif and vicky kaushal europe tour on their honeymoon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com