Vicky Kaushal : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. వాళ్ళను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్టార్ హీరోలు మంచి సినిమాలను చేసి వాళ్ళకంటూ స్టార్ డమ్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఛావా సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ‘విక్కీ కౌశల్’ (Vicky Koushal) ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నమైతే చేశాడు. ఈ సినిమాతో దాదాపు 600 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాడు. లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ ని రాబడతాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సంవత్సరం నేషనల్ అవార్డును కూడా తనే దక్కించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : విక్కీ కౌశల్ వయస్సులో తనకంటే 5 సంవత్సరాలు పెద్దదైన కత్రినా కైఫ్ ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..?
వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం నేషనల్ అవార్డుని కనక విక్కీ కౌశల్ అందుకున్నట్లయితే ఒక అరుదైన రికార్డును కూడా ఆయన నెలకొల్పుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఛావా సినిమాలో ఆయన నటనకి గాను ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపైతే లభించింది. ఇక ప్రేక్షకులందరూ ఈ సంవత్సరం అతనికి నేషనల్ అవార్డు వస్తుందంటూ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు.
ఇక శంభాజి మహారాజు గా ఆయన నటించిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ప్రతి సీన్ లో కూడా ఆయన అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ బతికి ఉంటే ఇలానే ఉంటాడేమో అని ప్రేక్షకులు మైమరిచిపోయేలా ఒక కొత్త ఫీల్ అయితే అందించే ప్రయత్నం చేశాడు. అందుకే విక్కీ కౌశల్ గురించి మన వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు చాలామంది అభిమానులుగా మారిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఛావా సినిమా ఆయన తప్ప అలాంటి పాత్రను మరెవరు పోషించలేరనే చెప్పాలి. ఆ పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి మన కళ్ళల్లో నుంచి నీళ్లను కూడా రప్పించాడు అంటే అది కేవలం విక్కీ కౌశల్ కి మాత్రమే సాధ్యమైంది అంటూ మరి కొంతమంది విక్కీ కౌశల్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం నేషనల్ అవార్డు గెలిచేది మాత్రం తనే అంటూ కొంతమంది చాలా స్ట్రాంగ్ గా చెబుతూ సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్ ని వైరల్ చేస్తున్నారు…
Also Read : లైట్ మేన్ గా పనిచేసిన విక్కీ కౌశల్ స్టార్ హీరోగా ఎలా మారాడు…