Nitya Menon: అలా మొదలైంది సనిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నీత్యా మేనన్. హీరోయిన్‌గానే కాకుండా, సింగర్‌గానూ తన టాలెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, మధ్యలో సడన్‌గా కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా.. అనుకోకుండా కాస్త గ్యాప్ తీసుకుంది నిత్య . మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గీరోగా నటిస్తోన్న భీమ్లానాయక్లో నటిస్తోంది నిత్యా. దీంతో పాటు విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్లోనూ నటించింది. ఇటీవలే ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అకట్టుకుంటోంది.

ఈ సినిమాతో నిత్యా కేవలం హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది నిత్య. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన నిత్య.. తనకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బే తగిలింది ఒక్క ప్రభాస్ విషయంలోనే.. ఆ విషయం ఇంకా నన్ను మానసికంగా బాధపెడుతూనే ఉంది. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా బాధేసింది. అలా మొదలైంది సినిమా నాకు తొలి సినిమా.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టా.. కాబట్టి నాకు పెద్దగా తెలేదు.. తెలుగు సినిమాలు కూడా చూడలేదు. అప్పుడు ప్రభాస్ గురించి అడిగితే నాకు తెలియదన చెప్పా. ఆ విషయాన్ని చాలా పెద్దది చేసి చూపించారు. నేనేదో తప్పు చేసినట్లుగా న్యూస్ క్రియేట్ చేశారు. అని చెప్పుకోచ్చారు. అప్పటి నుంచే అన్ని చోట్లా నిజాయితీగా ఉండకూడదని..మాటల గారడే అందరికి కావాలని అర్థమైందని అన్నారు నిత్య.