Keerthy Suresh : పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthi Suresh). మలయాళం లో బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా మారి, తెలుగు లో ‘నేను శైలజ’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమై, చూస్తూ ఉండగానే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని అందుకునే రేంజ్ కి ఎదిగిపోయింది. ఒక స్టార్ హీరోకి ఎంతటి స్థాయి ఉంటుందో, కీర్తి సురేష్ కి కూడా అంతటి స్థాయి వచ్చేసింది. ఆమె ఒక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకుందంటే, కచ్చితంగా ఆ చిత్రంలో ఎదో స్పెషల్ ఉంటుంది అనే భావనకు వచ్చేసారు ఆడియన్స్. కీర్తి సురేష్ కారణంగా అదనంగా ఒక సినిమాకు బిజినెస్ జరిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆమె ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాల్సిన హీరోయిన్, కొన్ని డిజాస్టర్ సినిమాల కోసం భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని వదిలేసుకుందట.
Also Read : కీర్తి సురేష్ నుండి డబ్బులు లాక్కున్న ఐస్ క్రీం షాప్ ఓనర్..వీడియో వైరల్!
ఇది ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పూర్తి వివరాల్లోకి వెళ్తే విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక(Rashmika Mandanna) కాంబినేషన్ లో తెరకెక్కిన చావా(Chhaava Movie) చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం. కేవలం డొమెస్టిక్ మార్కెట్ లో ఈ చిత్రానికి 600 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు దాదాపుగా 800 కోట్ల రూపాయలకు దగ్గరగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వదులుకుందట కీర్తి సురేష్. ఈ చిత్రం లో హీరోయిన్ క్యారక్టర్ కోసం ముందుగా ఆమెనే సంప్రదించారట, కానీ ఆమె అప్పటికే తన డేట్స్ ని ‘బేబీ జాన్’ సినిమాకు కేటాయించింది.
తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రీమేక్ చేసారు. రెస్పాన్స్ దారుణంగా వచ్చింది. కనీసం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఇలాంటి డిజాస్టర్ సినిమా కోసం అంతటి గొప్ప చిత్రాన్ని వదిలేసావా అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కీర్తి సురేష్ ని ట్యాగ్ చేసి బాధపడుతున్నారు. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ ని కూడా ఈమె మిస్ అయ్యిందట. ఇందులో త్రిష క్యారక్టర్ ని కీర్తి సురేష్ కి పోషించే అవకాశం వచ్చింది. కానీ ఆమె డేట్స్ ని సర్దుబాటు చేయలేక వదులుకుందట, ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉంటుందా చెప్పండి.
Also Read : పెళ్లైన మూడు నెలలకే సంచలన ప్రకటన చేసిన కీర్తి సురేష్..అభిమానులకు ఊహించని షాక్!