Homeఎంటర్టైన్మెంట్Katrina Kaif: గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన కత్రినా కైఫ్.. ఫ్యాన్స్ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Katrina Kaif: గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన కత్రినా కైఫ్.. ఫ్యాన్స్ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Katrina Kaif: తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా యూత్ ఆడియన్స్ అమితంగా ఆరాధించే హీరోయిన్స్ లో ఒకరు కత్రినా కైఫ్. ఈమె ‘మల్లీశ్వరి’ అనే టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ద్వారానే వెండితెర కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తో ‘అల్లరి పిడుగు’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అక్కడ […]

Katrina Kaif: తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా యూత్ ఆడియన్స్ అమితంగా ఆరాధించే హీరోయిన్స్ లో ఒకరు కత్రినా కైఫ్. ఈమె ‘మల్లీశ్వరి’ అనే టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ద్వారానే వెండితెర కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తో ‘అల్లరి పిడుగు’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అక్కడ రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో , ఇక కత్రినా కైఫ్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ అతి తక్కువ సమయం లోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యూత్ ఆడియన్స్ కి కలల రాకుమారి లాగా మారిపోయింది.

2023 వ సంవత్సరం వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన కత్రినా కైఫ్, ఆ తర్వాత ఎందుకో స్పీడ్ తగ్గించేసాడు. ఈమె ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడింది. అయినప్పటికీ కూడా సినిమాలను కొనసాగిస్తూ వచ్చింది , కానీ అకస్మాత్తుగా ఇప్పుడు మూడేళ్ళ నుండి ఇండస్ట్రీ లో కనిపించడం లేదు. కొత్త హీరోయిన్స్ ప్రభావం కారణంగా ఈమెకు సినిమాలు రావడం తగ్గిపోయాయో, లేదా పెళ్లి తర్వాత ఈమె సినిమాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించాలని అనుకుందో తెలియదు కానీ , ఈమె అభిమానులు మాత్రం బాగా మిస్ అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ఉంది కానీ , పెద్దగా యాక్టీవ్ గా ఉండదు. అయితే రీసెంట్ గానే ఒక పెళ్లి ఫంక్షన్ కి హాజరైన కత్రినా కైఫ్ ని చూసి సోషల్ మీడియా లో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

సన్నగా, నాజూగ్గా , జీరో సైజు ఆకారంతో కనిపించే కత్రినా కైఫ్ , ఇలా ఒక్కసారిగా ఆంటీ లాగా తయారైంది ఏంటి?, ఆమెని ఈ రూపం లో అసలు చూడలేకపోతున్నాము అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కత్రినా కైఫ్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి , ఆ మాత్రం శరీరం లో మార్పులు రావడం సహజమే. అయితే ఎంతో మంది హీరోయిన్స్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా గ్లామర్ ని మైంటైన్ చేస్తూ , నిరంతరం వర్కౌట్స్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నారు కాబట్టి. కానీ కత్రినా కైఫ్ కి సినిమాల్లో నటించాలనే ఆసక్తి పోయినట్టుగా ఉంది , అందుకే ఆమె ఇలా తయారైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper