Chhaava and Baahubali 2 : విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన(Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘చావా'(Chhaava Movie) బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్కో రికార్డుని బద్దలు కొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ లో ‘బాహుబలి 2’ ఫుల్ రన్ నెట్ వసూళ్లను అందుకోవడం చాలా కష్టం గా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సినిమాలు అవలీలగా బాహుబలి 2(Bahubali 2 Movie) ఫుల్ రన్ వసూళ్లను దాటేస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి ‘చావా’ చిత్రం కూడా చేరిపోయింది. ఈ సినిమా రీసెంట్ గానే ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ క్లోజింగ్ వసూళ్లను అధిగమించింది అంటున్నారు ట్రేడ్ పండితులు. బాహుబలి చిత్రం ఆరోజుల్లో దాదాపుగా హిందీ వెర్షన్ లో 510 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు ని ‘చావా’ చిత్రం నాలుగు రోజుల ముందే అధిగమించింది.
Also Read : ‘చావా’ తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..థియేటర్స్ లో ఉండగానే ఇంత తొందరగా రావడానికి కారణం అదేనా!
ప్రస్తుతం ‘చావా’ చిత్రానికి 542 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కలెక్షన్ల ఊపు ఏమాత్రం తగ్గలేదు. ఫుల్ రన్ లో కచ్చితంగా 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. అయితే ఈ సినిమా ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ ఫుల్ రన్ రికార్డ్స్ ని అధిగమిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పుష్ప చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ నుండి 750 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. చావా చిత్రానికి ఈ నెల మొత్తం థియేట్రికల్ రన్ వచ్చినా, ‘పుష్ప 2’ ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో ఈ చిత్రం 620 కోట్ల రూపాయిల వద్ద ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు. కానీ మహారాష్ట్ర ప్రాంతం లో థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికీ అనేక థియేటర్స్ లో సాయంత్రం షోస్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.
మరోపక్క తెలుగు వెర్షన్ వసూళ్లు వీకెండ్ వరకు బాగానే ఉన్నాయి కానీ, మామూలు వర్కింగ్ డేస్ లో కాస్త జోరు తగ్గింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో నాలుగు రోజులకు కలిపి 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది డీసెంట్ వసూళ్లే అయినప్పటికీ, హిందీ లో లాగా , ఇక్కడ కూడా మ్యాజిక్ చేసి కనీసం 50 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అనుకున్నారు. కానీ క్లోజింగ్ కి 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చేలా అనిపిస్తుంది. సినిమాని హిందీ లో విడుదలైన మూడు వారాలకు తెలుగు లో దింపడం వల్ల, ఆ ప్రభావం గట్టిగా పడిందని, అందుకే పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో పక్క ఈ సినిమాని ఏప్రిల్ 11న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read : బాహుబలి 2 ఆల్ టైం రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉన్న సినిమాలు ఇవే…