Bigg Boss 10 Telugu: ప్రతీ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం వచ్చిందంటే చాలు , సెలబ్రిటీలు మొత్తం కలిసి రోహిత్ పై పడిపోతుంటారు. ఇతరుల నామినేషన్స్ లోకి దూరిమరీ అతన్ని టార్గెట్ చేసి తిడుతుంటారు. ఈ వారం కూడా అదే రిపీట్ అయ్యింది. కానీ మొన్నటి వరకు సెలబ్రిటీలు మాత్రమే టార్గెట్ చేసేవారు , ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. మొత్తం మీద నేడు నామినేషన్స్ లో రోహిత్ ని హౌస్ లోని 14 మంది కంటెస్టెంట్స్ తో కొట్లాడడాన్ని మన చూడొచ్చు. ఇంతకు ముందు రోహిత్ కి సపోర్టుగా షాలిని ఉండేది , ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ సమయం లో షాలిని లేదు , ఇక రోహిత్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. కాసేపటి క్రితమే రోహిత్ ని లైవ్ లో శివ్ కుమార్ నామినేట్ చేసాడు.
ఈ నామినేషన్ లో అతను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో , అవి చాలా సిల్లీ గా అనిపించింది , అదే సమయం లో రోహిత్ ని కార్నర్ చేసి , ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున చేత మరోసారి తిట్టించి , అతనికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేందుకు కుట్ర చేసినట్టుగా కూడా అనిపించింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లోపలకు వచ్చినప్పుడు , అందరూ షాలిని ని టార్గెట్ చేసి నెగెటివ్ గా మాట్లాడడం తో , రామకృష్ణ తో రోహిత్ మాట్లాడుతూ ‘ఏంట్రా మీ అందరికి ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా ఏంటి , అందరూ ఒకే మాట పట్టుకున్నారు’ అని ఫన్నీ గా అన్నాడట . ఇది పక్కనే ఉన్న శివ్ కుమార్ విని , దీన్ని నేడు నామినేషన్ పాయింట్ లోకి తీసుకొచ్చాడు.
మీ అందరికీ ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా?, అందరూ ఒకే మాట అంటున్నారు అన్న మాటలను , బిగ్ బాస్ టీం స్క్రిప్ట్ ఇచ్చారా అన్నట్టుగా మార్చి శివ్ కుమార్ రోహిత్ పై నిందలు వేసాడు. కానీ రామకృష్ణ నిజం చెప్పడంతో శివ్ కుమార్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అంతే కాదు , అందరినీ సార్ , సార్ అంటూ పిలిచే శివ్ కుమార్ , రామకృష్ణ ని ఒక సందర్భం లో ‘రేయ్’ అని పిలిచాడట. దీంతో శివ్ కుమార్ మాస్క్ మొత్తం తొలగిపోయింది. అయితే శివ్ కుమార్ నామినేషన్ చేస్తున్న సమయం లో సెలబ్రిటీస్ మొత్తం సంబరాలు చేసుకున్నారు. రోహిత్ ని మరోసారి కార్నర్ చేశారు. వైల్డ్ కార్డ్స్ కూడా రోహిత్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో మరో సారి రోహిత్ వెర్సస్ హౌస్ మేట్స్ గా మారింది ఈ వారం నామినేషన్స్.