Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor alcohol addiction: మద్యానికి బానిసైన జాన్వీ కపూర్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Janhvi Kapoor alcohol addiction: మద్యానికి బానిసైన జాన్వీ కపూర్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Janhvi Kapoor alcohol addiction: లెజండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Jhanvi Kapoor) , బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా, టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన ‘దేవర’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఆమె గ్లోబల్ […]

Janhvi Kapoor alcohol addiction: లెజండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Jhanvi Kapoor) , బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా, టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా నటించిన ‘దేవర’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న ‘పెద్ది’ చిత్రం పై కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండుంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30 న విడుదల చేసేవారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరింత సమయం కోరుతూ ఈ చిత్రాన్ని జూన్ నెలకు వాయిదా వేశారు.

గ్రౌండ్ లెవెల్ లో ఈ చిత్రం పై ఉన్న బజ్ మామూలుది కాదు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అను బాంబు లాగా పేలింది. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాటలో రామ్ చరణ్ స్టెప్పులతో పాటు , జాన్వీ కపూర్ అందచందాలు పెద్ద హైలైట్ గా నిలిచాయి. ఒకవేళ ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోగలిగితే ఇక జాన్వీ కపూర్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ రీసెంట్ గా జాన్వీ కపూర్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో , ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మద్యానికి బానిస అయిన వాళ్ళ గురించి , అదే విధంగా తానూ ఒకానొక సందర్భంలో మద్యానికి ఏ రేంజ్ లో బానిస అయ్యానో చెప్పుకొని బాగా ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.

ఆమె మాట్లాడుతూ ‘మద్యానికి బానిస అయిన వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూడడం ఆపండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, విపరీతమైన పని ఒత్తిడి, లేదంటే మానసిక క్షోభ ని తట్టుకోలేక , మద్యాన్ని ఒక్కసారి సేవించడం , ఆ తర్వాత వాళ్లకు తెలియకుండానే దానికి బానిస అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళను దూరంగా పెడితే , వాళ్ళు ఇంకా మద్యానికి ఎక్కువగా బానిసలు అవుతారు. అదే ప్రేమతో దగ్గరకు తీసుకుంటే , ఆ బానిసత్వానికి దూరం అవుతారు. నేను కూడా జీవితం లో ఒకానొక సందర్భంలో మద్యానికి బానిస అయ్యాను. మొదట్లో ఎదో సరదాగా ఒకసారి తాగాను , ఆ తర్వాత నేను దానికి బానిసని అయ్యాను . ఉదయం నిద్ర లేవగానే మందు కొట్టేదాన్ని, ఆ సమయం లో నామీద నాకే అసహ్యం వేసింది. అప్పుడు వెంటనే మద్యం తాగడం ఆపేశాను ‘ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper