Homeఎంటర్టైన్మెంట్Buchi Babu: బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్...

Buchi Babu: బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్ హీరోయిన్..

Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , కరువులో టాలీవుడ్ ని కాసుల కనకవర్షం తో నింపేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ గురించి , చివరి 45 నిమిషాల గురించి ఆడియన్స్ ఎంతలా అయితే మాట్లాడుకుంటున్నారో , […]

Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , కరువులో టాలీవుడ్ ని కాసుల కనకవర్షం తో నింపేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ గురించి , చివరి 45 నిమిషాల గురించి ఆడియన్స్ ఎంతలా అయితే మాట్లాడుకుంటున్నారో , హీరో జాన్వీ కపూర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ బుచ్చి బాబు ఆమె పాత్రని మలచిన తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేవలం డైరెక్టర్ ని మాత్రమే కాదు, మహానటి శ్రీదేవి కూతురు అయ్యుండి , ఇలాంటి పాత్రలు చేయడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జాన్వీ కపూర్ మీద కూడా తీవ్రమైన ట్రోల్స్ వేస్తున్నారు.

అయితే ఈ అంశం పై ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నిన్ననే యాంకర్ అనసూయ , దర్శకులు ఒక సినిమా ని తీసేటప్పుడు , కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న కామెంట్స్ కి రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘దయచేసి హీరోయిన్లను అనవసరంగా నిందించకండి. చిత్రానికి సంబంధించిన దర్శక నిర్మాతలను నిందించండి. మా లాంటి హీరోయిన్స్ కి పెద్ద హీరోల సినిమాల్లో భాగం అవ్వాలని , ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని ఉంటుంది. ఈ క్రమం లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాల మేరకు పనిచేస్తాము. డైరెక్టర్ మహిళా పాత్రలను సరిగా రాయబడలేదని మీకు అనిపిస్తే, ఆ పాత్రలను రాసే రచయితలకు , డైరెక్టర్స్ కి ఎంత బాధ్యత ఉంటుంది అనేది గుర్తించండి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఎందుకు మీరంతా అనవసరంగా జాన్వీ కపూర్ ని నిందిస్తున్నారు , ఆ పాత్ర ని క్రియేట్ చేసిన బుచ్చి బాబు ని తిట్టండి అంటూ చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కన్నడ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ కుర్ర హీరోయిన్ , తెలుగు లోకి అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘నా సామి రంగ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది , ఇక రీసెంట్ గా ఈమె మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం లో నటించింది. ఇప్పుడు ఈమె ముఖ్యపాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper