Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan release date: ఎట్టకేలకు 'జన నాయగన్' కి విముక్తి.. విడుదల తేదీని గ్రాండ్...

Jana Nayagan release date: ఎట్టకేలకు ‘జన నాయగన్’ కి విముక్తి.. విడుదల తేదీని గ్రాండ్ గా ప్రకటించిన మేకర్స్..

Jana Nayagan release date: ఈ ఏడాది జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని, సెన్సార్ సభ్యులు అడ్డుకోవడం వల్ల విడుదల ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు సినిమాని చూసి సెన్సార్ సభ్యుల నిర్ణయానికి మద్దతుగా తీర్పుని ఇవ్వడం , ఆ తర్వాత సెన్సార్ సభ్యులు చెప్పిన సూచనలను బట్టి కొన్ని సన్నివేశాలను కత్తిరించడం వంటివి జరిగింది. అయినప్పటికీ […]

Jana Nayagan release date: ఈ ఏడాది జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని, సెన్సార్ సభ్యులు అడ్డుకోవడం వల్ల విడుదల ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కడం, కోర్టు సినిమాని చూసి సెన్సార్ సభ్యుల నిర్ణయానికి మద్దతుగా తీర్పుని ఇవ్వడం , ఆ తర్వాత సెన్సార్ సభ్యులు చెప్పిన సూచనలను బట్టి కొన్ని సన్నివేశాలను కత్తిరించడం వంటివి జరిగింది. అయినప్పటికీ సెన్సార్ సభ్యులు మొన్నట్టి వరకు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ చిత్ర హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యినప్పటికీ కూడా సెన్సార్ బోర్డు అసలు తగ్గలేదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నిన్నటితో పూర్తి అయ్యాయట.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి A సర్టిఫికేట్ జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక , ఆయన అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో చిందులు వేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ఆన్లైన్ లో లీకైన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో వేలమంది ఈ చిత్రాన్ని ఇప్పటికే వీక్షించారు. అయినప్పటికీ కూడా ఇది విజయ్ చివరి చిత్రం , పైగా ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి విడుదల అవుతున్న సినిమా కావడం తో ప్రేక్షకుల్లో ఈ చిత్రం అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. మొదట్లో విడుదల అయ్యుంటే ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండేవో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి. మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన బాలయ్య ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, విజయ్ కి కూతురు గా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించింది. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రం లో విలన్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు , ట్రైలర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి మేకర్స్ విడుదలకు ముందు వేరే కొత్త కంటెంట్ ని విడుదల చేస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper