Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా, విజయ్ చివరి చిత్రం కావడం తో , ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో తెలియదు కానీ , ఈ వీకెండ్ వరకు మాత్రం కచ్చితంగా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు వస్తాయని అనుకోవచ్చు. ఇకపోతే విజయ్ కి ఇదే చివరి చిత్రం కావడంతో , ఆయన అభిమానులు ఈ సినిమాని కనీవినీ ఎరుగని రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. తమిళనాడు థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
అయితే తమిళనాడు లోని ఒక థియేటర్ లో అభిమానులతో పాటు కూర్చొని, హీరోయిన్ త్రిష స్పెషల్ ఫ్యాన్స్ షో చూడడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. థియేటర్ లో సినిమాని చూసి బయటకు వస్తున్న సమయంలో ఆమెని మీడియా ముట్టడించి ప్రశ్నల వర్షం కురిపించే ప్రయత్నం చేసింది. కానీ త్రిష వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పరుగులు తీసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయ్ , త్రిష లు ప్రస్తుతం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ప్లాన్ లో కూడా ఉన్నారు. ఈమధ్య కాలం లో అనేక సందర్భాల్లో వీళ్లిద్దరు కలిసి తిరిగిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా విజయ్ పుట్టినరోజు కి త్రిష ఇచ్చిన క్యూట్ సర్ప్రైజ్ ఫోటోలు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేశాయి .
అలా వీళ్ళ రిలేషన్ గురించి బహిరంగంగా ఇప్పటి వరకు అధికారికంగా చెప్పకపోయినా, మేమిద్దరం కలిసి బ్రతుకుతున్నాము అనే సంకేతాలు అభిమానులకు, జనాలకు స్పష్టంగా ఇచ్చేశారు . ఈ నేపథ్యం లో ‘జన నాయగన్ ‘ థియేటర్ లో త్రిష సందడి చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమా గురించి మీడియా ముందు ఒక నాలుగు మాటలు మాట్లాడి ఉండుంటే బాగుండేది. కానీ మీడియా ని చూడగానే ఆమె పరుగులు తీసింది. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఆమె ఏమి మాట్లాడినా బాగా వైరల్ అయిపోతుంది. అందుకే ఈసారి ఏమి మాట్లాడకూడదు అని నిర్ణయించుకుందేమో , అందుకే ఆమె మీడియా ని ఎదురుకోకుండా వెళ్లిపోయిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
తమిళనాడు అంతా జననాయగన్ ఫీవర్ తో ఊగిపోతోంది…
ఈ సినిమాని త్రిష.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో… అభిమానుల మధ్యన చూసింది.
అయితే సినిమా చూశాక మాత్రం.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది.
సినిమా ఎలా ఉంది అని అడిగితే కనీసం నోరు మెదపలేదు.
త్రిష ఏం మాట్లాడినా.. వైరల్… pic.twitter.com/umd87oZbTO
— Telugu360 (@Telugu360) July 23, 2026







